
జోహో కోసం టీసీఎస్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ లాంటి పెద్ద పెద్ద సంస్థల ఆఫర్లు వదులుకున్నాం. కానీ జోహో మమ్మల్ని సైలెంట్ గా బయటకు పంపుతోంది. 300 మంది ఫ్రెషర్స్ ను తొలగించింది.. అంటూ ఎక్స్ లో ఒక పోస్ట్ వైరల్ గా మారింది. జోహో ఎంప్లాయ్ చేసిన ఈ పోస్టుతో 300 మందిని జోహో లేఆఫ్ చేసినట్లు వార్తలు వైరల్ గా మారాయి.
చాలా కంపెనీల్లో ఎంప్లాయిస్ కు ఎంతో కొంత స్టెబిలిటీ ఉంటుంది.. కొన్నాళ్లు బెంచ్ మీద కూర్చోబెట్టడమైనా ఉంటుంది. కానీ.. ఇదేంటో జోహోలో ఎలాంటి సమాచారం లేకుండా సైలెంట్ గా పంపిచ్చేస్తున్నారు.. అంటూ ఎఫెక్టెడ్ ఎంప్లాయ్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆర్థికంగా లేని కుటుంబం నుంచి వచ్చాను.. ఈ జాబ్ నాకు కేవలం కెరీర్ లో తొలిమెట్టు మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువ.. అంటూ పెట్టిన పోస్ట్ చాలా మందిని ఎమోషనల్ గా టచ్ చేస్తోంది.
కంపెనీ క్లారిటీ :
ఈ పోస్ట్ తో సోసల్ మీడియాలో పెద్ద బజ్ ఏర్పడిందనే చెప్పాలి. కోఫౌండర్ శ్రీధర్ వేంబు పై కూడా చర్చ జరగటం మొదలైంది. ఈ క్రమంలో ఈ ఇష్యూపై కంపెనీ క్లారిటీ ఇచ్చింది. కంపెనీ ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించలేదని పోస్ట్ చేసింది. కంపెనీ ప్రోగ్రామ్ గురించి అపార్థం చేసుకోవడం వల్లనే ఈ కన్ఫ్యూజన్ మొదలైనట్లు పేర్కొంది.
►ALSO READ | కొత్త సీఈఓ రాకతో డిస్నీ ఉద్యోగులకు కష్టాలు.. 1000 మందిని పీకేస్తానంటూ మెయిల్స్..
జోహో హెచ్ఆర్ మేనేజర్ మొహమ్మద్ సొహైల్ మాట్లాడుతూ.. ఇంటర్న్ షిప్ ముగిసిన ఎంప్లాయ్ పెట్టిన పోస్ట్ అది అని తెలిపారు. ఇంటర్న్ షిప్ ముగిసిన అభ్యర్థి.. తను ఎంప్లాయిగా భావించడం వల్లనే అలా అపార్థం చేసుకున్నట్లు తెలిపారు. కంపెనీ రూల్స్ ప్రకారం.. ఇంటర్న్ షిప్ అనేది లెర్నింగ్ ప్రోగ్రాం మాత్రమేనని.. పూర్తైన తర్వాత ఉద్యోగంలో చేర్చుకోవచ్చు లేదంటే లేదు.. అది కంపెనీ డెసిషన్ అని తెలిపారు. ఇంటర్న్ షిప్ అంటే గ్యారెంటీగా జాబ్ లోకి తీసుకోవడం కాదని చెప్పారు. అదే సమయంలో ఫ్రెషర్స్ ను జాబ్స్ లోకి తీసుకుంటున్నామని.. కొత్త వారిని ఎందుకు తొలగిస్తామని అన్నారు. లేయాఫ్స్ చేశామని అబద్ధం. సదరు అభ్యర్థి ఇంటర్న్షిప్ ముగిసింది.. అంతేనని చెప్పారు.