Reading Time: < 1 minute

భయాన్ని వ్యాప్తి చేయొద్దు.. ఆర్టికల్ 81 చదవండి

Caption of Image.
  • డీలిమిటేషన్‌‌‌‌పై బీజేపీ స్టేట్​ చీఫ్​ రాంచందర్ రావు ట్వీట్ 

హైదరాబాద్, వెలుగు: డీలిమిటేషన్ అంశంపై ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం ఆపా లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సూచించారు. ఈ విషయంలో అనవసరంగా రాజకీయం చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయడంపై ‘ఎక్స్’ వేదికగా రాంచందర్ రావు స్పందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ని ఒకసారి చదవాలని సూచించారు. 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 81లో ‘సాధ్యమైనంత వరకు’ అనే పదాన్ని వాడారని గుర్తు చేశారు. దీన్ని బట్టి డీలిమిటేషన్ అనేది కేవ లం జనాభా ఆధారంగా మాత్రమే జరగదని అర్థమవుతుందని తెలిపారు. ఇతర సంబం ధిత అంశాలను కూడా పరిగణనలోకి తీసు కునే అవకాశం డీలిమిటేషన్ కమిషన్‌‌‌‌కు ఉం టుందని రాంచందర్ రావు చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.