Reading Time: < 1 minute
Yash Reveals No Scenes With Ranbir Kapoor In Ramayana Part 1

ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, సౌత్ సెన్సేషన్ సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రానికి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రావణుడి పాత్రలో కన్నడ సూపర్ స్టార్, రాకింగ్ స్టార్ యష్ నటిస్తుండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి. ఇటీవల విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను ప్రపంచవ్యాప్త స్థాయికి తీసుకెళ్లగా, మేకర్స్ కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్లను మొదలుపెట్టారు.

Also Read :Arya: వారణాసిలో సాధువులంతా నకిలీలే.. హీరో ఆర్య వ్యాఖ్యలపై భగ్గుమన్న హిందూ సంఘాలు

ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఇంటర్వ్యూలో యష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా రణబీర్ కపూర్‌తో తన కాంబినేషన్ సీన్స్ గురించి మాట్లాడుతూ ఆయన ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఈ సినిమాలో ఇప్పటి వరకు రణబీర్‌కు, తనకూ మధ్య ఒక్క సీన్ కూడా చిత్రీకరించలేదని యష్ వెల్లడించారు.. ‘ఇది రెండు భాగాలుగా వస్తున్న సినిమా. ఇందులో ఇద్దరికీ వేర్వేరు రాజ్యాలు (అయోధ్య, లంక) ఉంటాయి. కథాక్రమం ప్రకారం మొదటి భాగంలో మా ఇద్దరి మధ్య సన్నివేశాలు ఇంకా రాలేదు’ అని ఆయన వివరించారు. కానీ షూటింగ్ పరంగా ఇద్దరూ కలవకపోయినప్పటికీ, సెట్స్‌లో కలిసినప్పుడు మాత్రం తమ మధ్య మంచి అనుబంధం ఉంటుందని, రణబీర్‌తో పని తీరు ఎంతో గొప్పగా ఉంటుందని యష్ చెప్పుకొచ్చారు. దీని బట్టి చేస్తే..

రాముడు, రావణుడు వెండితెరపై ఒకరినొకరు ఢీకొనే సన్నివేశాలు రెండవ భాగంలోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని యష్ మాటలను బట్టి అర్థమవుతోంది. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో, ఆస్కార్ విజేత హన్స్ జిమ్మర్ సంగీతంలో రాబోతున్న ఈ పౌరాణిక దృశ్యకావ్యం భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై నిలబెడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. యష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.