Reading Time: 2 minutes
Rohit Sharma Injury Update Mi Vs Pbks Ipl 2026 Hamstring Scan Report

Rohit Sharma injury update: రోహిత్ శర్మ గాయంపై ముంబై ఇండియన్స్ (MI) అభిమానుల్లో గందరగోళం నెలకొంది. మంగళవారం జరిగిన నెట్‌ సెషన్స్‌లో రోహిత్ ఎక్కడా కనిపించలేదు. దీంతో రోహిత్‌కు గాయం పెద్దదిగా మారిందని అందరూ అభిప్రాయపడుతున్నారు. గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో రోహిత్ ఆడతాడా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇంతలో హిట్‌మ్యాన్ హెల్త్ రిపోర్టు వెలువడింది. క్రికెట్ బజ్ తాజా నివేదిక ప్రకారం.. మ్యాచ్ అనంతరం రోహిత్‌కు స్కానింగ్ నిర్వహించారు. ఈ రిపోర్టులో ఎటువంటి కండరాల చిరుగు (Tear) ఉన్నట్లు ఆధారాలు లభించలేదు. ప్రాథమిక మెడికల్ రిపోర్ట్‌లో కండరాల సంబంధిత సమస్యలు ఏవీ లేవని (No signs of a tear) తేలింది. అయితే, ఈ మెడికల్ రిపోర్ట్ ఇంకా అసంపూర్తిగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. హిట్‌మ్యాన్‌కు మరికొన్ని పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి హెల్త్ రిపోర్టు వచ్చిన తర్వాతే గాయంపై పూర్తి స్పష్టత వస్తుంది.

READ MORE: AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. 12 ఏళ్ల రికార్డు బ్రేక్..

ఒకవేళ ఇది తీవ్రమైన గాయం కాకపోతే, రాబోయే మ్యాచ్‌లకు రోహిత్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా, బీసీసీఐ మెడికల్ టీమ్ ప్రస్తుతం రోహిత్‌ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. త్వరలోనే ఈ అంశంపై ముంబై ఇండియన్స్ లేదా బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. హ్యామ్‌స్ట్రింగ్ గాయాలు సీరియస్‌గానే పరిగణించబడతాయట. అయితే.. రోహిత్ అయిన గాయాన్ని పరిశీలిస్తే మరీ ఎక్కువ మ్యాచులకు దూరం కావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అతడిని ఆడించి రిస్క్ తీసుకోవడం కంటే, విశ్రాంతినిచ్చి గాయం తీవ్రం కాకుండా చూడాలని మేనేజ్మెంట్ భావిస్తోందట. అయినప్పటికీ, తన అనుభవం దృష్ట్యా తుది నిర్ణయాన్ని మేనేజ్మెంట్ రోహిత్ కే వదిలేసింది. ఆడాలా? వద్దా? అనేది రోహిత్ చేతిలోనే ఉంది.

READ MORE: Ruturaj Gaikwad: సాకులు చెప్పను.. గెలిచినా మేం ఇంకా మెరుగుపడాలి!

ఇంతకీ రోహిత్ శర్మకి ఏమైంది?
ఆదివారం(ఏప్రిల్ 13న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), ముంబై ఇండియన్స్‌(MI)కి జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మకు గాయమైంది. 241 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా ఆరో ఓవర్లో 13 బంతుల్లో 19 పరుగులు చేశాడు రోహిత్. తర్వాత రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇక ఆరో ఓవర్‌ ప్రారంభానికి ముందు రోహిత్ (Rohit Sharma) ఇబ్బందిపడుతూ కనిపించాడు. ఫిజియో వచ్చి ట్రీట్‌మెంట్ అందించాడు. ఆ ఓవర్‌లో రెండో బంతిని ఎదుర్కొన్న తర్వాత రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. తర్వాత ఈ బ్యాటర్ తిరిగి బ్యాటింగ్‌కు రాలేదు. ఈ మ్యాచ్‌లో ముంబయి 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 137 రన్స్ చేశాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 78 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.