Reading Time: < 1 minute

బీజేపీకి కార్యకర్తలే బలం.. బలగం : ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్

Caption of Image.
  •     ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్

నేరడిగొండ, వెలుగు: బీజేపీకి కార్యకర్తలే బలం, బలగమని.. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పండిత్ దీన్ దయాల్ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కార్యకర్తలు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. 

పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. క్రమశిక్షణతో పనిచేసి పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.బ్రహ్మానందం, కార్యదర్శి గాదె శంకర్, ప్రధాన కార్యదర్శి మాధవ్ రావు ఆమ్టే, ఉపాధ్యక్షుడు బి.వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.