Reading Time: < 1 minute

గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య

Caption of Image.

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీ గురుకులాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం విద్యానగర్ బీసీ భవన్​లో ఆయన మాట్లాడుతూ.. గురుకుల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం గర్వకారణమని, అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరిన్ని పాఠశాలలు పెంచి, వాటికి సొంత భవనాలు నిర్మించాలని కోరారు. ఇదే వేదికపై తెలంగాణ బీసీ శివాజీ ఆర్మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎస్. ప్రవీణ్ గౌడ్​ను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు.

 

©️ VIL Media Pvt Ltd.