Reading Time: < 1 minute

చేపల వేటకు వెళ్లి..విద్యుత్ షాక్ తో యువకుడి మృతి

Caption of Image.

చేపల వేట ఆ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. విద్యుత్ షాక్ ఇచ్చి చేపలు పట్టే క్రమంలో జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది.వివరాల్లోకి వెళితే..

జూలపల్లి మండలం వడకాపూర్ గ్రామానికి చెందిన ఖాజిం పాషా అనే యువకుడు మంగళవారం (ఏప్రిల్ 14) న చేపలు పట్టేందుకు గ్రామ శివారులోని హుస్సేన్ మియా వాగుకు వెళ్లాడు. చేపలకు కరెంట్ షాక్ ఇచ్చి చేపలను పట్టేందుకు ఖాజం పాషాప్రయత్నించాడు. ఈ  క్రమంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

©️ VIL Media Pvt Ltd.