Reading Time: < 1 minute
Elderly Woman Throws Chilli Powder At Official In Vijayawada Collectorate Over Land Dispute

Vijayawada: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోని ప్రజా పరిష్కార వేదికలో అధికారులపై ఓ వృద్ధురాలు కారం చల్లిన ఘటన కలకలం రేపింది. నందిగమ్మ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన మల్లంపూడి లక్ష్మీ తులసి భూ సమస్య పరిష్కారం కాలేదన్న కోపంతో కలెక్టరేట్లో గ్రీవెన్స్ సమయంలో అధికారిపై కారు చెల్లింది. దీంతో ఆమె సమస్య చర్చకు వచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు వెంటనే అనాసాగరం గ్రామానికి వెళ్లి భూమిని పరిశీలించారు. నందిగామ ఎంఆర్ఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో సర్వే అధికారులు స్థలాన్ని కొలిచి వివరాలు సేకరించారు. సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారం తీసుకొని పరిష్కారం చూపిస్తామని ఎంఆర్ఓ హామి ఇచ్చారు.

CM Chandrababu: అమరావతిలో భారత్‌ తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీకి శ్రీకారం చుట్టిన సీఎం..!

జాతీయ రహదారి పక్కన తనకు 8 1/2 సెంట్ల స్థలం ఉండేదని 2003లో రహదారి విస్తరణలో 50మీటర్ల భూమి వెళ్ళిపోయిందని వృద్ధురాలు తెలిపింది. ఆ తర్వాత 2017లో నందిగామ బైపాస్ రోడ్ విస్తరణ సమయంలో మరింత స్థలం పోయిందని చెప్పింది. ప్రస్తుతం తన దగ్గర 4 సెంట్లు మాత్రమే మిగిలిందని చెప్తోంది. ఈ భూమికి సంబంధించి 2023లో ఆమెకు 6.5 లక్షలు మాత్రమే జమయ్యాయని పక్కనున్న వారికి అదే తరహా భూమికి 24 లక్షలు ఇచ్చారని వృద్ధురాలు ఆరోపిస్తుంది. తనకు రావలసిన పూర్తి పరిహారం ఇవ్వాలని లేదా మిగిలిన స్థలం స్పష్టంగా చూపించాలని ఆమె డిమాండ్ చేసింది.

Volkswagen Taigun Facelift: బడ్జెట్ SUVలో ప్రీమియం ఫీల్.. వోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ విడుదల.. ఫీచర్లు, ధర వివరాలు

గతంలో అనేకసార్లు స్థానిక అధికారులను సంప్రదించిన సమస్య పరిష్కారం కాలేదని అంటుంది. కలెక్టరేట్ చుట్టూ తిరిగిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. విసుకు చెంది నిన్న అగ్రీవెన్స్ లో అధికారిపై కారం చెల్లినట్లు ఆమె తెలిపింది.