Reading Time: < 1 minute
Cm Chandrababu Naidu Launches India First Quantum Reference Facility In Amaravati

CM Chandrababu: ప్రపంచ క్వాంటం దినోత్సవం (World Quantum Day)ను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక రంగంలో ఒక చారిత్రాత్మక ముందడుగు పడింది. సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి (Amaravati)లో దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ (Quantum Reference Facility)ని ప్రారంభించారు. దీంతో అమరావతి క్వాంటం టెక్నాలజీ (Quantum Technology) అభివృద్ధిలో కీలక కేంద్రంగా మారనుంది.

Nitish Kumar: ముగిసిన నితీష్ కుమార్ శకం.. సీఎం పదవికి రాజీనామా..

ఈ సందర్భంగా SRM యూనివర్సిటీలోని 1S ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ (Open Access Quantum Facility)తో పాటు, మేధా టవర్స్ (Medha Towers)లోని 1Q క్వాంటం ఫెసిలిటీ (1Q Quantum Facility)ని సీఎం ఆవిష్కరించారు. ఈ రెండు అత్యాధునిక క్వాంటం టెస్ట్ బెడ్స్ (Quantum Test Beds) ద్వారా క్వాంటం కంప్యూటింగ్ (Quantum Computing) ఉపకరణాలను పరీక్షించే (Testing), ధృవీకరించే (Certification) సామర్థ్యం రాష్ట్రానికి లభించింది.

ఈ ఫెసిలిటీల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి -273 డిగ్రీల సెల్సియస్ వద్ద పనిచేసే విధంగా రూపొందించబడ్డాయి. ఈ స్థాయి సాంకేతికతతో క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్ (Quantum Computer Hardware) పనితీరును పరీక్షించడం, విశ్లేషించడం సాధ్యమవుతుంది. దీంతో అమరావతి “క్వాంటం వ్యాలీ” (Quantum Valley)గా ఎదగడానికి బలమైన పునాది ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ క్వాంటం టెస్ట్ బెడ్స్ ద్వారా క్వాంటం ఉపకరణాల తయారీ కంపెనీలు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు పెద్ద ఎత్తున ఉపయోగం కలగనుంది. ఇది పరిశోధన, ఇన్నోవేషన్లకు కీలక వేదికగా మారనుంది.

CM Chandrababu Letter: వైఎస్‌ జగన్‌ సహా అన్ని పార్టీల అధ్యక్షులకు సీఎం చంద్రబాబు లేఖ.. ‘నారీ శక్తి వందన్’కు మద్దతివ్వండి..

ఈ కార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్, డిపార్ట్మెంట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతినిధులు, వివిధ క్వాంటం టెక్నాలజీ సంస్థల నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు (Scientists) హాజరయ్యారు. దేశంలో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి ఇది ఒక మైలురాయిగా భావిస్తున్నారు.