Reading Time: < 1 minute

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో లగేజీలో పేలిన సెల్‌ఫోన్..

Caption of Image.

హైదరాబాద్ లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటరేషనల్ ఎయిర్ పోర్టులో ప్రమాదం జరిగింది. లగేజీ తనిఖీలో సెల్ ఫోన్ పేలడంతో కలకలం రేగింది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. అధికారులు కాసేపు ఆందోళనకు గురయ్యారు.

మంగళవారం (ఏప్రిల్ 14)న రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా CISF అధికారులు లగేజీ చెక్ చేస్తుండగా సెల్‌ఫోన్ పేలింది. సెల్‌ఫోన్ పేలిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కాసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలకు సంబంధించి కారణాలు ఇంకా తెలియలేదు. పూర్తి విచారణ తర్వాత ప్రమాదానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. 

వేసవి కాలం కారణంగా ఫోన్లలో ఓవర్ హీట్ వల్ల సెల్ ఫోన్లు పేలుతున్నట్లు చెబుతున్నారు. 2025లో దాదాపు ఇదే సమయంలో జేబులో సెల్ ఫోన్ పెలిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. రాజేంద్రనగర్ లో శ్రీనివాస్ అనే యువకుడి ప్యాంటు జేబులో ఉన్న ఫోల్ పేలింది. వాతావరణ మార్పులు, స్టోరేజ్ దాటి వాడకం మొదలైన కారణాల వల్ల ఇలాంటి ప్రమాదలు జరుగుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.