Reading Time: < 1 minute

మంత్రి వివేక్  సహకారంతో అభివృద్ధి.. మందమర్రిలో మినీ ట్యాంక్బండ్పనులు ప్రారంభం

Caption of Image.

కోల్ బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సహకారంతో చెన్నూరు నియోజకవర్గం, పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో మినీ ట్యాంక్ బండ్ వాకింగ్ ట్రాక్, సుందరీకరణ పనులను కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 23వ వార్డులోని ఊరు మందమర్రి చెరువుపై ట్యాంక్ బండ్ సుందరీకరణ కోసం మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ రూ.3.30 కోట్లు మంజూరు చేశారన్నారు. మంత్రి వివేక్ వందల కోట్ల నిధులు తీసుకువచ్చి చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బత్తుల తిరుపతి, మేకల రాజన్న, నాగుల దుర్గయ్య, తోట నరహరి,రామస్వామి, రాంరెడ్డి, తోటరాజు తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.