Reading Time: < 1 minute

ఏడాది లోపు పిల్లలకు గుడ్డు తినిపించొచ్చా..? డాక్టర్లు చెబుతోంది ఇదే..!

Caption of Image.

పిల్లలకి ఏం తినిపించాలన్నా ఒకటికి పి పదిసార్లు ఆలోచిస్తుంటారు తల్లులు. ‘పలానా ఫుడ్ పడకపోతే’ అన్న ఆలోచనతో రెగ్యులర్ డైట్ నే  ఎక్కువగా ఫాలో అవుతుంటారు. గుడ్లు, మాంసాల జోలికి అస్సలు వెళ్లరు. అయితే ఏడాది దాటిన పిల్లలకు ఎంచక్కా గుడ్డు తినిపించొచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్.. ఏడాది పిల్లలకి గుడ్డు తేలిగ్గా జీర్ణమవుతుంది అంటున్నారు. 

అలాగే కోడిగుడ్డులో విటమిన్-బి12, విటమిన్-డి, యాండీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల్ని ఫిట్ గా ఉంచడమే కాదు యాక్టివ్ చేస్తాయి. పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కి సాయపడతాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషియన్ స్టడీ ప్రకారం తొమ్మిది నెలల నుంచే పిల్లలకి గుడ్డు తినిపించొచ్చు. 

దానివల్ల పిల్లల్లో కాన్సన్ ట్రేషన్ పెరుగుతుందని చెప్తోంది ఈ స్టడీ. వాషింగ్ టన్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం ఏడు నుంచి తొమ్మిది నెలల మధ్య పిల్లల డైట్లో గుడ్డు చేరిస్తే వాళ్లు త్వరగా ఎదుగుతున్నట్టు తేలింది.

©️ VIL Media Pvt Ltd.