
ముంబై: RCB హిట్టర్ టిమ్ డేవిడ్, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా జరిమానా ఎదుర్కొన్నారు. వాంఖడే స్టేడియంలో ఆదివారం రాత్రి ఆర్సీబీ, ముంబై మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ల ఆదేశాలను ధిక్కరించినందుకు గాను క్రమశిక్షణ చర్యల కింద టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. అలాగే అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను చేర్చారు.
మ్యాచ్ సమయంలో బాల్‌ను అంపైర్లకు అప్పగించమని పదేపదే కోరినప్పటికీ, రెండుసార్లు తను నిరాకరించడంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవల్-1 ఉల్లంఘన కింద ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు కూడా రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్‌లో ముంబై జట్టుకు ఇది తొలి తప్పిదం కావడంతో నిబంధనల ప్రకారం ఈ పెనాల్టీ పడింది.
FUN BANTER B/W ROHIT SHARMA & TIM DAVID
– Rohit Sharma teasing Tim David 😅
— Sam (@Cricsam01) April 12, 2026