Reading Time: < 1 minute

ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి  : ఎమ్మెల్యే కేఆర్నాగరాజు

Caption of Image.

వర్ధన్నపేట, వెలుగు: ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆధునిక వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కేఆర్​నాగరాజు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో నిర్మించనున్న 100 పడకల ఆస్పత్రికి కేటాయించిన దేవాదాయ శాఖ భూమిని ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. త్వరగా భూమికి బౌండరీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దేవాదాయ శాఖ భూమిని హాస్పిటల్ నిర్మాణానికి కేటాయించినందుకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  

©️ VIL Media Pvt Ltd.