Reading Time: < 1 minute

అడ్డుకున్నది అమెరికానే… శాంతి చర్చలపై ఇరాన్‌‌‌‌ మంత్రి అరాఘ్చి

Caption of Image.

టెహ్రాన్‌‌: అంగుళం దూరంలో ఉండగా ఇరాన్‌‌ అమెరికా మధ్య శాంతి ఒప్పందం ఆగిపోయిందని ఇరాన్‌‌ విదేశాంగ మంత్రి‌‌ అబ్బాస్‌‌ అరాఘ్చి తెలిపారు. రెండు దేశాల మధ్య డీల్‌‌.. ఇక ఓకే అవుతుందనగా అమెరికా అప్పటికప్పుడు లేనిపోని కొత్త డిమాండ్లను ముందుకు తెచ్చి అడ్డంకులు సృష్టించిందని ఆయన సోమవారం ట్వీట్‌‌ చేశారు. 

యుద్ధం ముగిసిపోతుందన్న నమ్మకంతో ఇరాన్‌‌ చర్చలకు వస్తే.. అమెరికా అఖరి నిమిషంలో అడ్డుపడిందని ఆరోపించారు. ‘‘ఇస్లామాబాద్‌‌లో జరిగిన చర్చలతో ఒరిగిందేమీ లేదు. 

మంచి వైఖరి మంచి ఫలితాన్ని ఇస్తుంది. వైరం ఎప్పటికైనా వైరాన్నే తీసుకొస్తుంది” అని అరాఘ్చి అమెరికాను హెచ్చరించారు. ఇరాన్‌‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌‌ కూడా అరాఘ్చి ట్వీట్‌‌ను సమర్థించారు.

©️ VIL Media Pvt Ltd.