Reading Time: < 1 minute

బామ్మర్ది మరణం తట్టుకోలేక..! అతిగా మద్యం తాగి ఐదంతస్తుల బిల్డింగ్ నుంచి దూకి..

Caption of Image.

కూకట్​పల్లి, వెలుగు: బామ్మర్ది మరణం తట్టుకోలేక అతిగా మద్యం తాగి ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన సలాని భీమ్​రావు (51) కొంతకాలంగా మూసాపేటలోని శ్రీరామ్ నగర్​లో నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. రోజూ తాగి వస్తుండటంతో ఇంట్లో భార్యతో తరచూ గొడవలు జరిగేవి. 

ఈ క్రమంలో ఆదివారం తన బామ్మర్ది అనారోగ్యంతో మృతి చెందడంతో మనస్తాపానికి గురయ్యాడు. అప్పటి నుంచి విరామం లేకుండా తాగుతూ .. సోమవారం మధ్యాహ్నం నివాసం ఉంటున్న భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కూకట్ పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.
 

©️ VIL Media Pvt Ltd.