Reading Time: < 1 minute

బలహీనవర్గాల సంక్షేమానికి  అంబేద్కర్ కృషి : రేవంత్

Caption of Image.
  • ఆయన సేవలు మరువలేం: రేవంత్

హైదరాబాద్, వెలుగు: ద‌‌ళిత‌‌, గిరిజ‌‌న, బడు గు, బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు భారత రాజ్యాంగ రూప‌‌శిల్పి బీఆర్ అంబేద్కర్‌‌ నిరంతరం కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 14న అంబేద్కర్  జయంతి సందర్భంగా సోమవారం ఆయన ఫొటోకు సీఎం  నివాళులర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్  చేసిన కృషిని ఆయన కొనియాడారు. దేశ భవిష్యత్తును త‌‌న ముందుచూపుతో ఊహించి, దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన భావి తరాలకు స్ఫూర్తిగా నిలి చారని అన్నారు.

అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం యావ‌‌ త్‌‌  ప్రపంచానికి ఆదర్శమని చెప్పారు. బాబాసాహెబ్  ఆలోచనల నుంచి ప్రేరణ పొందిన తమ ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంద‌‌ని సీఎం రేవంత్​ రెడ్డి గుర్తు చేశారు.  

©️ VIL Media Pvt Ltd.