Reading Time: < 1 minute
Daughter Poisons Father Milkshake Chandrapur Murder Case

Shocking Crime: మహారాష్ట్రలో తండ్రిని హత్య చేసిన నేరం వెలుగులోకి వచ్చింది. చంద్రపూర్ జిల్లాలో సొంత కూతురే తండ్రిని విషం పెట్టి హత్య చేసింది. హత్య జరిగిన మూడేళ్ల తర్వాత ఈ హత్య బయటకు వచ్చింది. ఈ కేసులో మాస్టర్ మైండ్ కూతురే అని పోలీసులు గుర్తించారు. ప్రియుడి సహాయంతో ఈ హత్యకు సదరు యువతి ప్లాన్ కేసింది. తండ్రికి మిల్క్‌షేక్‌లో విషం కలిపి ఇచ్చి చంపేసింది. దీనిని ముందుగా సహజ మరణంగా నిందితులు ప్లాన్ చేశారు. మూడేళ్ల తర్వాత, ప్రియుడే ఈ సమాచారాన్ని పోలీసులకు చెప్పారు.

Read Also: మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

మృతుడు జయంత్ బల్లవార్ అనే వ్యక్తి పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతడి కుతురు ఆర్య కూడా పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తుంది. ఆర్యకు ఆశిష్ మహేష్ షెడ్మాకేతో ప్రేమ సంబంధం ఉంది. ఈ ప్రేమను జయంత్ బల్లవార్ తీవ్రంగా వ్యతిరేకించడంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. 2023 ఏప్రిల్ 24న ఇద్దరు కలిసి తండ్రి హత్యకు ప్లాన్ చేశారు. చైతన్య అలియాస్ మాంటీ ద్వారా రూ. 5000లకు విషం కొనుగోలు చేశారు. మిల్క్ షేక్‌లో కలిపి తండ్రికి ఇచ్చి హత్య చేసింది. విషం తాగిన కొద్దిసేపటికే అస్వస్థతలో ఆస్పత్రిలో చేరిన జయంత్, కొద్దిసేపటికే మరణించాడు.

ముందుగా ఈ మరణాన్ని సహజమరణంగా పోలీసులు నమోదు చేశారు. నిందితురాలు ఆర్య తప్పుడు సమాచారం ఇచ్చింది. దీంతో కేసు అక్కడే ఆగిపోయింది. ఆర్య, ఆమె ప్రియుడు కొంతకాలం కలిసి జీవించారు. మూడేళ్ల తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2026 మార్చి 23 ఆశిష్ పోలీసుల ముందు అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఈ కేసులో ఆర్య, ఆశిష్, చైతన్యలతో పాటు ఒక మైనర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.