Reading Time: 2 minutes

IPL vs Congress MLA: ఒక్కో టికెట్ రూ.35 వేలా!.. బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల దందాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్

Caption of Image.

IPL vs Congress MLA: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే బెంగళూరు వేదిక రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. టికెట్ల పంపిణీపై కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐపీఎల్ టికెట్ల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని, బ్లాక్ మార్కెటింగ్ కొనసాగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి భద్రత, మౌలిక సదుపాయాలు వంటి అన్ని సౌకర్యాలను పొందుతున్న కేఎస్‌సీఏ.. ఎమ్మెల్యేలు, మంత్రులకు కనీసం టికెట్లు కూడా ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద కాశప్ప మండిపడ్డారు.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ మ్యాచ్ టికెట్లు రూ. 5,000 ఉంటే దాన్ని రూ. 35,000 వరకు అమ్ముతున్నారని, సామాన్య క్రికెట్ అభిమానులకు టికెట్లు దొరకడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర్  ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ వ్యవస్థ ఉన్నప్పటికీ పారదర్శకత లేదని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను కొందరు ఎమ్మెల్యేలు సమర్థించినప్పటికీ, మరికొందరు ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థను ఫ్యాన్స్‌కు సమాన అవకాశం కల్పించే విధంగా రూపొందించబడిందని తెలిపారు. 

►ALSO READ | Rishabh Pant: లక్నో కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ ఔట్.. సంజీవ్ గోయెంకా ఏమ్మన్నారంటే!

కాగా ఐపీఎల్ 2026 సీజన్ సమీపిస్తుండటంతో.. ఈ వివాదం హై‑డిమాండ్ క్రికెట్ టికెట్‌ల నిర్వాహణపై అనేక అనుమానాలకు దారి తీస్తుంది. మంగళవారం నాడు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ హోం మ్యాచులకి సంబంధించిన టికెట్లను అధికారిక వెబ్ సైట్లలో విడుదల చేసిన నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయ్యాయి. కానీ థర్డ్ పార్టీ యాప్స్ లలో ఈ మ్యాచులకి సంబంధించిన టికెట్లు ఉండటం చూసిన కొందరు అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టికెటింగ్ విధానంలో పారదర్శకత లోపించిందని పేర్కొన్నారు. 

 

 

©️ VIL Media Pvt Ltd.