Reading Time: 2 minutes
తమిళ స్వాముల దౌర్జన్యం.. లక్ష ఇవ్వకపోతే శపిస్తాం

రాను రాను మోసగాళ్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఆలయాల్లో హుండీలను చోరీ చేయడం చూశాం.. బంగారం దుకాణాల్లో కస్టమర్స్‌లా వచ్చి చేతివాటం చూపిన దొంగలనూ చూశాం.. ఇప్పుడు స్వామీజీ వేషంలో వచ్చి డబ్బులివ్వకపోతే శపిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన కృష్ణాజిల్లా ఉయ్యూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో ఆథ్యాత్మిక వేత్తల్లా వచ్చిన కొందరు కేటుగాళ్లు, అమాయక వృద్ధ దంపతులను భయభ్రాంతులకు గురిచేశారు. ఆకునూరు గ్రామానికి చెందిన ప్రసాద్ రావు, మణి అనే వృద్ధ దంపతుల ఇంటికి కాషాయ వస్త్రాలు ధరించి స్వామీజీల వేషంలో కొందరు వ్యక్తులు వచ్చారు. తాము స్వామీజీలమని, తమకు ఆశ్రమం ఉందని, అందులో గోవుల నిర్వహణ కోసం లక్ష రూపాయలు విరాళం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తం తమ వద్ద లేదని దంపతులు చెప్పడంతో, సదరు వ్యక్తులు డబ్బులు ఇవ్వకపోతే ‘శపిస్తాం’ అంటూ బెదిరింపులకు దిగారు. వారి హెచ్చరికలతో భయపడిపోయిన దంపతులు, ప్రాధేయపడి తమ వద్ద ఉన్న 5 వేల రూపాయలను వారికి సమర్పించుకున్నారు. బాధిత దంపతులు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో, వారు వెంటనే ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, సదరు స్వామీజీలు కేవలం డబ్బులు అడగడమే కాకుండా, ఆ వృద్ధ దంపతుల కుటుంబ రహస్యాలను, వ్యక్తిగత వివరాలను కూడా బయటపెట్టడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. దీని వెనుక కుటుంబ సభ్యులకు తెలిసిన వ్యక్తుల హస్తం ఏమైనా ఉందా? లేదా పక్కా ప్లాన్‌తో సమాచారం సేకరించి వచ్చారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.కేసు నమోదు చేసిన పోలీసులు గ్రామంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ వాహనంపై వెళ్లారు? అనే విషయాలను సేకరిస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, అపరిచితులు స్వామీజీల వేషంలో వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఉయ్యూరు రూరల్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎవడ్రా వీడు.. మటన్‌ ఉడకలేదు.. పోలీస్ కేసు పెట్టాడు..

బరువు పెరిగితే.. జీతంలో కోత ?? ఇదేం రూల్ రా నాయనా..

PAN Card: అలర్ట్‌.. మారబోతున్న పాన్‌ రూల్స్‌.. ఈ సారి ఆ ప్రూఫ్ తప్పనిసరి

Weather Update: వచ్చే 3 రోజులూ వానలే.. చల్ల చల్లని.. కూల్ కూల్

Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. మరీ దారుణంగా పడిపోయిన బంగారం, వెండి ధరలు