Reading Time: < 1 minute
Chicken Prices: మాంసం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. కిలో చికెన్‌ ధర రూ.400

తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ) ప్రస్తుత వేసవి ఎండలు, ఉత్పత్తి తగ్గడం వల్ల చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఇప్పటికే యుద్ధం వల్ల ధరలు మండిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు చికెన్‌ ధరలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు గ్యాస్‌ కష్టాలు, మరో వైపు నిత్యవసర వస్తువుల ధరలతో పాటు చికెన్‌ ధరలు పెరుగుతుండటం సామాన్య ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. మార్చి 24, 2026 నాటికి ప్రధాన నగరాల్లో ఉన్న తాజా ధరల వివరాలు ఇక్కడ ఉన్నాయి:

ప్రధాన నగరాల్లో చికెన్ ధరలు (1 కేజీకి):

ప్రాంతం లైవ్ కోడి (Live) స్కిన్‌తో (With Skin) స్కిన్‌లెస్ (Skinless) నాటు కోడి (Country Chicken)
హైదరాబాద్ రూ.230 – రూ.250 రూ.340 – రూ.360 రూ.360 – రూ.380 రూ.750 – 850
విజయవాడ రూ.220 – రూ.240 రూ.330 – రూ.350 రూ.360 – రూ.400 రూ.700 – రూ.800
విశాఖపట్నం రూ.210 – రూ.230 రూ.330 – రూ.350 రూ.350 – రూ.380 రూ.750 – రూ.900
వరంగల్/గుంటూరు రూ.225 – రూ.245 రూ.330 – రూ.345 రూ.350 – రూ.370 రూ.700 -రూ.800

ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు:

ఎండల తీవ్రత: వేసవి తాపానికి కోళ్లు మృతి చెందడం వల్ల ఫామ్స్‌లో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది.

డిమాండ్, సరఫరా: పెళ్లిళ్ల సీజన్, ఫంక్షన్ల కారణంగా డిమాండ్ పెరగడం, అదే సమయంలో సరఫరా తగ్గడం వల్ల ధరలు కొండెక్కాయి.

రవాణా ఖర్చులు: పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం రవాణాపై పడి చికెన్ ధరలను మరింత పెంచింది.

గమనిక: పైన పేర్కొన్న ధరలు మార్కెట్ పరిస్థితులు, మీ ప్రాంతంలోని రిటైల్ దుకాణదారులను బట్టి రూ.10 నుండి రూ.20 వరకు వ్యత్యాసం ఉండవచ్చు. అలాగే ఒకే ఏరియాలో కూడా వివిధ షాపుల్లో కూడా ధరలు కొంత వ్యత్యాసం ఉంటుందని గమనించండి. ఈ ధరన్ని కాస్త ఇటు ఇటుగా ఉంటాయని గుర్తించుకోండి.

ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు పండగే.. పండగ.. రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం, వెండి ధరలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి