July 11, 2026

Petrol-Diesel: వాహనదారులకు ఊరట.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన

Petrol-Diesel: వాహనదారులకు ఊరట.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన
Reading Time: < 1 minute
Government Clarifies Petrol Diesel Lpg Supply Stable

పశ్చిమాసియా యుద్ధం కారణంగా సోషల్ మీడియాలో చమురు, గ్యాస్‌పై విపరీతంగా వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. గ్యాస్, చమురు కొరత ఏర్పడవచ్చని పుకార్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది.

పెట్రోలియం అండ్ సహజ వాయువుల మంత్రిత్వ శాఖ, జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ.. దేశంలో పెట్రోల్, డీజిల్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉందని హామీ ఇచ్చారు. ఎవరూ ఎలాంటి ఆందోళనలు చెందక్కర్లేదని భరోసా ఇచ్చారు. ‘‘సహజ వాయువు విషయానికి వస్తే నేను మీకు చెప్పినట్లుగా భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులందరూ పీఎన్‌జీకి మారితే ప్రయోజనకరంగా ఉంటుంది.’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఎల్పీజీ, పెట్రోలియం సరఫరాలు స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేశారు. భారత చమురు ట్యాంకర్ ‘‘జగ్ లాడ్కి’’ ఫుజైరా నుంచి భారతదేశానికి ముడి చమురును తీసుకువస్తూ సురక్షితంగా బయలుదేరిందని వెల్లడించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, వంటగ్యాస్ నిరంతరాయంగా లభించేలా తగిన చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు.

ఇది కూడా చదవండి: Mamata Banerjee: టీఎంసీ తొలి జాబితా విడుదల.. మమతా బెనర్జీ పోటీ ఎక్కడ్నుంచంటే..!

ఇక ఎల్పీజీ సిలిండర్ల కోసం భయాందోళనలతో బుకింగ్ చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. దేశంలో ఎక్కడా కూడా ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల దగ్గర సరఫరా నిలిచిపోయినట్లుగా నివేదికలు రాలేదని పేర్కొంది. అయినప్పటికీ అధిక సంఖ్యలో కాల్స్ రావడం వల్ల కొన్ని గ్యాస్ డిపోల దగ్గర వ్యవస్థకు అంతరాయాలు ఏర్పడి.. పొడవైన క్యూలు ఏర్పడినట్లుగా అభిప్రాయపడింది.