Watermelons: ఉచితంగా వాటర్ మిలన్లు.. ఎగబడిన జనం.. ఎక్కడో తెలుసా..?

Free Watermelons: పంటలో వాటర్ మిలన్ పండ్లు అలాగే వదిలేయడంతో వాటికోసం స్థానిక గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఎగబడుతున్నారు ఉచితంగా ఎవరికి తోచినంత వారం తీసుకెళ్తున్నారు. ఈ దృశ్యాలు చూసిన వారంతా అయ్యో పాపం రైతు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
దేవనకొండ మండలం మాచాపురం గ్రామానికి చెందిన ఈశ్వరయ్య అనే రైతు తనకు ఉన్న పొలంలో వాటర్ మిలన్ (పుచ్చకాయలు) సాగు చేశారు. పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది. వర్షాలు లేని కారణఃగా ఉన్న నీటితోనే పొదుపు చేసుకుంటూ పంట సాగు చేశాడు. పొలం నిండా పుచ్చకాయలే కనిపిస్తున్నాయి. కష్టాలు అప్పులు తీరుతాయని అనుకుంటున్న సమయంలో.. ధర ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. అడిగేవారు కొనేవారే లేరు. పట్టణానికి తీసుకెళ్లి అమ్ముకుందామంటే కూలీలు రవాణా ఖర్చులకు కూడా డబ్బులు రావని ఉద్దేశంతో పొలంలోనే వదిలేశాడు రైతు ఈశ్వరయ్య.
ఈ విషయం స్థానిక గ్రామాలకు చెందిన ప్రజలకు తెలిసింది. ఇంకేముంది ఎక్కడెక్కడ నుంచో వచ్చి రైతులు వాటర్ మిలన్ పండ్లు తీసుకెళ్తున్నారు. ఇది గమనించి బాధపడటం మినహా రైతు ఈశ్వరయ్య చేసేదేమీ లేదు. ఇలాంటి వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. పాపం నష్టపోయిన రైతు ఈశ్వరయ్యను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
ఇది కూడా చదవండి: Silver Anklet: మహిళలు ధరించే కాళ్ల పట్టీలు త్వరగా అరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సూపర్ టిప్స్..!
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి