పాత పెన్షన్ పునరుద్ధరించాలి ..జన జాగరణ యాత్ర షురూ..సీపీఎస్ రద్దు చేయాలని TSCPSEU డిమాండ్Caption of Image.
భద్రాచలం, వెలుగు: తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్(టీఎస్సీపీఎస్ఈయూ) ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దుకు జన జాగరణ యాత్ర శనివారం భద్రాచలంలో ప్రారంభమైంది. రాముడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా అధ్యక్షుడు తుక్కాని శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు.