July 12, 2026

దహేగాం పీఎస్ హెడ్ కానిస్టేబుల్ సూసైడ్..మంచిర్యాల జిల్లా కుశ్నపల్లి లో ఘటన

దహేగాం పీఎస్ హెడ్ కానిస్టేబుల్ సూసైడ్..మంచిర్యాల జిల్లా కుశ్నపల్లి లో ఘటన
Reading Time: < 1 minute

దహేగాం పీఎస్ హెడ్ కానిస్టేబుల్ సూసైడ్..మంచిర్యాల జిల్లా కుశ్నపల్లి లో ఘటన

Caption of Image.

బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామానికి చెందిన హెడ్​ కానిస్టేబుల్​ ఎమునూరి ప్రభాకర్​రెడ్డి(48) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. దహేగాం స్టేషన్​లో హెడ్​ కానిస్టేబుల్​గా పని చేస్తున్న అతడికి ఇటీవల హిప్​ సర్జరీ(తుంటి శస్త్రచికిత్స) జరిగింది. నొప్పి కారణంగా డ్యూటీకి హాజరు కాలేకపోతున్నాడు. ఇటీవల మళ్లీ నొప్పి తిరగబెట్టడంతో భరించలేక ఈ నెల 8న కుశ్నపల్లి శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద పురుగు మందు తాగాడు. అతడిని 108లో మంచిర్యాలలోని ప్రైవేట్​ హాస్పిటల్​కు, అక్కడి నుంచి వరంగల్​ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం చనిపోయాడు. మృతుడికి భార్య లక్ష్మి, పిల్లలు రిశ్విక, మౌనిక ఉన్నారు. మృతుడి సోదరుడు మల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. 

 

©️ VIL Media Pvt Ltd.