Reading Time: < 1 minute

న్యూఢిల్లీ : ఒకపక్క బీహార్‌లో కమలం సర్కార్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తూనే కేంద్రంలోని మో డీ ప్రభుత్వం మరోపక్క గురువారంనాడు అర్ధరా త్రి హఠాత్తుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్‌ల బదిలీలు, నియామకాలు చేపట్టింది. తెలంగాణ గవర్నర్‌గా పనిచేస్తున్న జిష్ణుదేవ్ వర్మ ను మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లాను నియమించారు. తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్‌ఎన్ రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమించారు. అంతకు ముందు పశ్చిమ బెం గాల్ గవర్నర్‌గా ఉన్న ఆనంద బోస్ తన పదవికి రాజీనామా చేయడం, వెనువెంటనే ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడడం చకచకా జరిగిపోయింది. తమిళనాడుకు కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఇన్‌ఛార్జి గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రకటన వెలువరించింది.

బీహార్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ హస్నైన్ నియమించారు. నాగాలాండ్ గవర్నర్‌గా నందకిశోర్ యాదవ్‌ను నియమించారు. ఇక ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న వినయ్‌కుమార్ సక్సేనాను లఢక్ గవర్నర్‌గ పంపించారు. అక్కడ గవర్నర్‌గా ఉన్న కవీందర్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ గవర్నర్‌గా నియమితులు అయిన శివప్రతాప్ శుక్లా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు. ప్రతాప్ శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని రుద్రాపూర్ గ్రామంలో జన్మించారు. ఇదిలావుండగా రాజీనామాకు దారితీసిన కారణాలను ఆనంద్ బోస్ వెల్లడించలేదు. తన రాజీనామా వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? వ్యక్తిగత కారణాలు ఇందుకు దారితీశాయా? అనేది ఆయన వెల్లడించలేదు. ప్రస్తుత పరిణామంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ విస్మయం వ్యక్తం చేశారు. గవర్నర్ రాజీనామా తనకు దిగ్భ్రాంతి కల్గించిందని మమత బెనర్జీ తెలిపారు.