Reading Time: < 1 minute

రేవల్లి: వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో ఘో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదుల శివారులో రెండు ట్రాక్టర్ల డోర్లు ఆటోకు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కొంకలపల్లి గ్రామానికి చెందిన భక్తులు జనుంపల్లిలోని మంత్రాలమ్మ జాతరకు ఆటోలో వెళ్లారు. గురువారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఇంటికి తిరిగివస్తుండగా రెండు ట్రాక్టర్ డోర్లకు ఆటో ఢీకొనడంతో ఇద్దరు చనిపోయారు. ఐదుగురు గాయపడడంతో వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు వెంకటయ్య, సుమిత్రమ్మగా గుర్తించారు. ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.