
న్యూజిలాండ్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికాతో జరిగిన సెమిఫైనల్ మ్యాచ్ లో కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ శతకంతో విధ్యంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సులతో వంద పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలెన్ తోపాటు మరో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ కూడా మెరుపులు మెరిపించాడు. అతను 33 బంతులు ఎదుర్కొని 58 పరుగులతో రాణించాడు. దీంతో సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 12.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించింది. దీంతో కివీస్ జట్టు ఫైనల్ కు చేరుకుంది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. మార్కో యాన్సెన్ అర్ద శతకంతో చెలరేగాడు. 30 బంతుల్లోనే 5 భారీ సిక్సులు, 2 ఫోర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బ్రెవిస్ 34 పరుగులు, స్టబ్స్ 29 పరుగులతో పర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర, మెక్‌కాంచి, హెన్రీ తలో రెండు వికెట్లు తీయగా.. నీషమ్, ఫెర్గూసన్ చెరో ఒక వికెట్ పడగొట్టారు.