
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాటర్లు తడబడుతున్నారు. 77 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది సఫారీ జట్టు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికాకు రెండో ఓవర్ లోనే బిగ్ షాక్ తగిలింది. ఈ ఓవర్ లో వెంటవెంటనే రెండు వికెట్లు చేజార్చుకుంది.
న్యూజిలాండ్ బౌలర్లు లైన్ అండ్ లెన్త్ బంతులతో చెలరేగడంతో సఫారీ బ్యాటర్లు పరుగులు చేసేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో భారీ షాట్లకు ప్రయత్నించి వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. సగం ఓవర్లకే కీలక బ్యాటర్లు ఔట్ కావడంతో సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. దీంతో సపారీ జట్టు 16 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో స్టబ్స్(13), యాన్సెన్(21)లు ఉన్నారు. ఇక, కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర, మెక్‌కాంచి చెరో రెండు వికెట్లు తీయగా.. నీషమ్ ఒక వికెట్ పడగొట్టాడు