Reading Time: < 1 minute

రాజ్యసభ స్థానాలపై త్వరలో క్లారిటీ: మహేశ్ కుమార్ గౌడ్

Caption of Image.

 రాజ్యసభ సభ్యులపై త్వరలో క్లారిటీ వస్తుందన్నారు టీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.  ఇంకా ఎవరు రేసులో ఉన్నారనేది చెప్పలేమన్నారు. ఏఐసీసీ  అన్ని సమీకరణాలు బేరీజు వేస్తోందని చెప్పారు . ఆశావహుల్లో కొందరు బీసీ నేతలు ఉన్నారని తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ స్థానాన్ని అడగడం లేదని చెప్పారు. కార్పొరేట్ శక్తులకు బీఆర్ఎస్ రాజ్యసభ సీటు ఇచ్చిందన్నారు.

►ALSO READ | కాజీపేట రైల్వే ట్రాక్‌‌‌‌‌‌‌‌ నిధుల స్కాం….సీబీఐ కేసు నమోదు

 కార్పొరేషన్ పదవులపై కసరత్తు జరుగుతోందన్నారు మహేశ్ కుమార్ గౌడ్. మార్చి కొన్ని కార్పొరేషన్ పదువులిస్తామని చెప్పారు.  రాష్ట్రం కోసం పనిచేసిన వాళ్లలో ఒక్కరికైనా బీఆర్ఎస్ రాజ్యసభ అవకాశం ఇచ్చిందా అని ప్రశ్నించారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు మశేశ్. మంత్రులెవరూ డీసీసీల ట్రైనింగ్ కు రావొద్దని చెప్పలేదన్నారు మహేశ్ కుమార్ గౌడ్.

©️ VIL Media Pvt Ltd.