Reading Time: < 1 minute

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’తో బాక్సాఫీస్‌ను అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ చికిరి చికిరికు వచ్చిన అద్భుతమైన స్పందనతో సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రంలో రామ్ చరణ్‌ను పూర్తిగా రగ్గడ్ అవతార్‌లో చూపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఆస్కార్ విజేత ఎఆర్ రెహ్మాన్ సమకూరుస్తున్నారు. తాజాగా మేకర్స్ రెండో సింగిల్ ‘రై రై రా రా…’ను విడుదల చేశారు. ఏఆర్ రెహ్మాన్ స్వయంగా ఆలపించిన ఈ పవర్‌ఫుల్ డ్యాన్స్ నంబర్ అదిరిపోయే మాస్ ఎనర్జీని అందిస్తోంది.

స్టార్ ఎంట్రీ సాంగ్ ఎలా ఉండాలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తూ, భారతీయ సినిమాలోనే అత్యంత భారీ పాటల్లో ఒకటిగా నిలిచేలా రూపుదిద్దుకుంది. రామ్ చరణ్ తన ట్రేడ్‌మార్క్ మాస్ ఎనర్జీ, డ్యాన్స్‌తో అదరగొట్టారు. జానీ మాస్టర్ అందించిన డైనమిక్ కొరియోగ్రఫీ విజువల్ ట్రీట్ గా నిలిచింది. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం పూర్తి మాస్ అప్పీల్‌తో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పెద్ది సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.