
నిరుపేదలకు దానం చేసిన భూమిని దౌర్జన్యంగా లాక్కునే హక్కు కాంగ్రెస్ పాలకులకు ఎవరిచ్చారు?.. కనీస కనికరం లేకుండా నిద్రమత్తులో ఉన్న అభాగ్యుల ఆవాసాలను నేలమట్టం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని బిజెపి మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన బిజెపి రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ , డాక్టర్ శీలం పాపారావులతో లిసి వెలుగుమట్లలోని భూదాన్ బాధితులను పరామర్శించారు. అనంతరం అంబేద్కర్ భవనంలో తలదాచుకున్న నిరాశ్రయులైనుపరామర్శించారు.ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాcisp 61 ఎకరాల భూదాన్ భూమిలో 31 ఎకరాల్లో పేదలు తలదాచుకుంటుంటే అమానుషంగా లాక్కున్న అధికార పక్షం, మిగతా 30 ఎకరాల భూమిని ఏ బడాబాబులకు కట్టబెట్టిందో, ఆ భూమి ఏమైందో తక్షణమే లెక్క చెప్పాలని ఆయన కోరారు. గత ఐదు రోజులుగా వెలుగుమట్ల ప్రాంతంలో అమాయక ప్రజల కన్నీళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లెదుటే గుడిసెలు కూలిపోయి బతుకులు రోడ్డున పడటంతో ఈ ప్రభుత్వం సర్వనాశనం కావాలని బాధితులు శాపనార్థాలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానం మినహా అన్ని స్థానాలను అధికార పక్షానికే కట్టబెట్టారని, కీలక మంత్రి పదవులు కూడా ఈ జిల్లాకే దక్కాయని గుర్తుచేశారు. పలువురు మంత్రులు ఉన్నా తమకు న్యాయం జరుగుతుందని జనం ఎంతో సంబురపడ్డారని, కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే దారుణంగా తమ ఇళ్లనే కూల్చివేస్తారని నిరుపేదలు ఏనాడూ ఊహించలేదని విమర్శించారు. మొదట్నుంచీ కాంగ్రెస్ దమననీతినే కొనసాగిస్తోందని మండిపడ్డారు. పెద్దల జోలికి వెళ్లే ధైర్యం లేకనే ఏ దిక్కూ లేని అభాగ్యులపై ప్రతాపం చూపుతున్నారని దుయ్యబట్టారు. అరవై రెండు ఎకరాల భూమిలో ముప్పై రెండు ఎకరాల్లో పేదలు తలదాచుకుంటుంటే దాన్ని అమానుషంగా లాక్కున్నారని, మిగతా ముప్పై ఎకరాలు ఎవరి చేతుల్లో ఉన్నాయో ఆ భూమి ఏమైందో చెప్పాలని నిలదీశారు. ఆ ముప్పై ఎకరాల భూమి లెక్క జిల్లా పాలనాధికారి చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం పేదల కళ్లలో మట్టి కొట్టిన అత్యంత దుర్మార్గపు ప్రభుత్వమని విమర్శించారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు , దొంగల సత్యనారాయణ, మందడపు సుబ్బారావు, గుత్తా వెంకటేశ్వర్లు, వీరవల్లి రాజేష్, బండారు నరేష్, నున్న రవికుమార్, విజయరాజు, కుమిలి శ్రీనివాస్, రవి రాథోడ్, శ్యామ్ రాథోడ్, ఏలూరి నాగేశ్వరరావు, కందుల శ్రీకృష్ణ, మందా సరస్వతి,మనీ , నకిరేకంటి వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.