Reading Time: < 1 minute

ఇరాన్ నాయకత్వాన్ని లక్షంగా చేసుకుని ఇజ్రాయెల్, అమెరికా సేనలు శనివారం జరిపిన దాడులు కీలక పరిణామాలకు దారితీశాయి. ఈ భీకర దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్‌జాదే దుర్మరణం చెందాడు.ఈ దాడుల తీవ్రతలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ అధినేత మహమ్మద్ పాక్పోర్ కూడా చనిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇది ఇరాన్ నాయకత్వానికి, ప్రత్యేకించి సైన్యానికి పెద్ద ఎదురుదెబ్బ అయింది. దాడుల కొద్ది గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. వీరి ఉనికిని గుర్తించి అత్యంత వ్యూహాత్మక దాడులకు దిగారని వెల్లడైంది. ఇప్పటివరకూ తమ సేనలకు ఆదేశాలు వెలువరిస్తూ వచ్చిన రక్షణ మంత్రి, సైన్యం అధినేత రెండు దేశాల దాడుల దశలో ఇతరులతో పాటు మృతి చెందినట్లు వెల్లడైంది. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీని, ఇరాన్ దేశాధ్యక్షులు మసౌద్ పెజెషకియాన్‌ను లక్షంగా ఎంచుకుని దాడులకు దిగుతున్నారు. తమ దాడులు ఇరానీయన్లపై కాదని, అక్కడి పాలకులపై అని ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (ఐడిఎఫ్) తెలిపాయి.