
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి, ఆలోచనకు గురిచేస్తోంది. సాధారణంగా ఎత్తైన భవనాలపై నిలబడటానికే చాలామంది భయపడుతుంటారు. కానీ ఈ వీడియోలో ముగ్గురు కూలీలు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఇనుప నిర్మాణంపై ఎంతో ప్రశాంతంగా కూర్చుని భోజనం చేస్తూ కనిపించారు. ఈ దృశ్యం చూసినవారు ఒకవైపు ఆశ్చర్యపోతుండగా, మరోవైపు వారి జీవిత పోరాటాన్ని చూసి చలించిపోతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో ముగ్గురు కార్మికులు ఎత్తైన టవర్ నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నట్లు కనిపిస్తున్నారు. వారి కింద లోతైన లోయ ఉండగా, చుట్టూ పర్వత ప్రాంతం కనిపిస్తోంది. అయినప్పటికీ వారు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ టిఫిన్ బాక్స్‌లు తెరిచి భోజనం చేస్తూ, నీళ్లు తాగుతూ కనిపించారు. వారి ముఖాల్లో భయం కంటే కుటుంబాన్ని పోషించాలనే బాధ్యత, కష్టపడి జీవించాలనే సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వ్యక్తి, “ప్రతి ఒక్కరికీ భయం ఉంటుంది. కానీ చాలాసార్లు కడుపు ఆ భయం కంటే పెద్దదిగా మారుతుంది. ప్రజలు నిలబడటానికే భయపడే చోట కొందరు తమ జీవనోపాధి కోసం పనిచేస్తారు” అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి.
వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వస్తున్నాయి. “పేదరికం మనిషిని ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది”, “భయం కంటే ఆకలి గొప్ప శక్తి”, “వారి ధైర్యానికి సెల్యూట్”, “కార్మికులే దేశ నిర్మాణానికి వెన్నెముక” అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు, “ఒక్కరోజు కార్మికులు పని మానేస్తే దేశ అభివృద్ధి స్తంభించిపోతుంది” అని అభిప్రాయపడ్డారు.
షాకింగ్ వీడియో ఇక్కడ చూడండి..
What is Fear
डर सबको लगता है लेकिन पेट अक्सर डर से बड़ा निकलता है
जहां लोगों की सांसे थम जाती है वहां कुछ लोग अपनी कमाईसे रोजी रोटी तलाशते हैं गरीबी इंसान को वहां पहुंचती है जहा
पहुंचने की हिम्मत हर किसी में नहीं होती है मंजिल जमीन पर
हो लेकिन अक्सर इनका संघर्ष आसमान में… pic.twitter.com/Fi7ixyaiBm— KUNDAN PATEL (@KUNDAN00PATEL) June 12, 2026
ఈ వీడియో కేవలం ఒక వైరల్ క్లిప్ మాత్రమే కాదు. రోజూ ప్రాణాలను పణంగా పెట్టి కుటుంబాల కోసం శ్రమించే లక్షలాది కార్మికుల జీవితాలను గుర్తు చేసే హృదయాన్ని కదిలించే దృశ్యంగా మారింది. వారి కష్టం, త్యాగం, ధైర్యం పట్ల గౌరవం వ్యక్తం చేస్తూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
