
Chattogram Controversy: బంగ్లాదేశ్ క్రికెట్‌లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఆ దేశ జాతీయ జట్టు స్పిన్నర్ నయీమ్ హసన్‌పై చిట్టగాంగ్‌లోని లాల్‌ఖాన్ బజార్ ఏరియాలో పోలీసులు దారుణంగా లాఠీఛార్జ్ చేశారు. ఢాకా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
నేను క్రికెటర్‌నని చెప్పినా వినలేదు:
తాను జాతీయ క్రికెటర్‌నని ఎంత మొత్తుకుంటున్నా వినకుండా, పోలీసులు ప్లాస్టిక్ పైపులు, లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారని నయీమ్ హసన్ స్థానిక మీడియా ముందు ఎమోషనల్ అయ్యాడు. తనను పోలీస్ వెహికల్‌లో కాకుండా ఆటోలో ఎక్కించడానికి ప్రయత్నించారని, ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా అక్కడి ఆఫీసర్ ఇన్‌ఛార్జ్ కూడా కళ్లు దించుకుని మాట్లాడాలంటూ తనతో రూడ్‌గా ప్రవర్తించాడని బంగ్లా క్రికెటర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు తనపై ఎందుకు దాడి చేశారో కూడా చెప్పలేదు, ఈ అనాగరిక చర్యపై తనకు ఖచ్చితంగా న్యాయం జరగాలని, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని నయీమ్ హసన్ డిమాండ్ చేశాడు.
తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టేది లేదు: పోలీస్ అధికారి
ఈ ఘటనపై చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ అమీరుల్ ఇస్లాం మాట్లాడుతూ.. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ సమయంలో పోలీసులు సరైన నియమ నిబంధనలు పాటించలేదని అర్థమవుతోందని ఒప్పుకున్నారు. నయీమ్ హసన్ కు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని, ఈ ఇన్సిడెంట్‌లో తప్పు చేసిన అధికారులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
ALSO READ : కేటీ పెర్రీ హై-ఫైవ్.. ఇగ్నోర్ చేసిన కుర్రాడు..
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం:
మరోవైపు జాతీయ జట్టు ప్లేయర్‌పై ఇలాంటి దాడి జరగడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశం తరఫున ఆడే ఒక అథ్లెట్ పట్ల ఇలా అనాగరికంగా ప్రవర్తించడం చాలా విచారకరం, ఈ విషయాన్ని బోర్డు అత్యంత సీరియస్‌గా తీసుకుంటోందని పేర్కొంది. దీనిపై వెంటనే సమగ్రమైన ఎంక్వైరీ జరిపి, బాధ్యులైన పోలీస్ సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత ప్రభుత్వ అధికారులను బీసీబీ డిమాండ్ చేసింది.
𝗦𝗛𝗢𝗖𝗞𝗜𝗡𝗚
Spinner Nayeem Hasan was Abducted and assaulted by people who claimed to be DB (Detective Branch) police!💔
Where is CWAB Now? pic.twitter.com/SJvfqKqA6o
— 𝐑𝐚𝐤𝐢𝐛🇧🇩💯 (@rakibul_hasan_4) June 13, 2026