ఉల్లిపాయ , వెల్లుల్లి కారం ముద్ద చాలా మంది వినే ఉంటారు. ఇది ఉదయం టిఫిన్‌కు కానీ సాయంత్రం సమయంలో తింటే మంచి రుచి ఉంటుంది. ఇంకా మీరు దీనిని వేడి వేడి అన్నంలో తింటే ఇక అద్భుతమే. దీనిలో నూనె వాడాల్సిన పనే లేదు. అది కూడా 2 నిమిషాల్లోనే అయిపోతోంది. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇలా రెండు కూడా. ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం
ఉల్లిపాయ , వెల్లుల్లి కారం ముద్దకు కావలసిన పదార్థాలు: రెండు ఉల్లిపాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు , 5 పచ్చిమిర్చి, అర కట్ట
కొత్తిమీర , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం , రుచికి సరిపడా ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి. ఏ కాలంలో అయినా దీనిని తినొచ్చు. అంత టేస్టీగా మంచిగా ఉంటుంది.
ఉల్లిపాయ , వెల్లుల్లి కారం ముద్ద తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయలను తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకా నాలుగు వెల్లుల్లి రెబ్బలు, 5 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. కొత్తిమీరను బాగా కడిగి ఒక ప్లేట్ లో పెటుకోవాలి. దీనికి నూనె వాడము కాబట్టి అది అవసరమే లేదు.
ఉల్లిపాయ , వెల్లుల్లి కారం ముద్ద స్టెప్ -1: గ్రైండ్ చేసి మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో కొద్దిగా నిమ్మరసం కూడా వేసి మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా అవసరమైతే దీనిలో కొద్దిగా లేదా ఒక స్పూన్ జీరా కూడా వేస్తె మంచిది తిన్న వెంటనే ఇది తిరిగిపోతోంది. చట్నీలా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
కేవలం 2 నిమిషాల్లో అయిపోయే ఈ వంటకం ఉద్యోగులు, బ్యాచిలర్స్ కు సూపర్ ఫుడ్. దీనికోసం ఎక్కువ సమయం అవసరం లేదు. ఇదే సైడ్ డిష్ గా కూడా పనికొస్తుంది. పచ్చిమిర్చి ఘాటు దీనిలో తగులుతుంది కాబట్టి నోటికి కమ్మగా అనిపించే మంచి ఫ్లేవర్ ఉంటుంది.




