
Brazil vs Morocco: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) లో ఇప్పటి వరకు జరగబోయే మ్యాచుల్లోనే అత్యంత భారీ హైప్ ఉన్న బిగ్గెస్ట్ మ్యాచ్‌కు టైమ్ దగ్గరపడింది. ఈరోజు (జూన్ 13, శనివారం ) జరగబోయే గ్రూప్–సీ మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్.. ఆఫ్రికన్ జెయింట్స్ మొరాకో (Morocco) తో తలపడనుంది.
6వసారి కప్పు కొట్టాలని కసితో బ్రెజిల్:
ఒకవైపు సరికొత్త కోచ్ కార్లో అన్సెలొట్టి నేతృత్వంలో ఆరోసారి కప్పు కొట్టాలని బ్రెజిల్ కసితో ఉంటే.. మరోవైపు గత 2022 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్ చేరి సంచలనం సృష్టించిన మొరాకో ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తోంది. ఈ క్రేజీ మ్యాచ్‌కు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇవే.
నెయ్‌మార్ కంబ్యాక్ వర్కవుట్ అవుతుందా?:
* ఫుట్‌బాల్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అయిన బ్రెజిల్.. కప్పు గెలిచి దాదాపు 24 ఏండ్లు దాటిపోయింది. గత ఐదు వరల్డ్ కప్‌లలో నాలుగు సార్లు క్వార్టర్ ఫైనల్స్‌లోనే ఇంటిబాట పట్టిన బ్రెజిల్‌పై ఈసారి అంచనాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి.
* స్టార్ పవర్: జట్టులో వినీషియస్ జూనియర్, రాఫిన్హా, మార్క్వినోస్ లాంటి కిర్రాక్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ.. అందరి కళ్లూ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ జూనియర్ (Neymar Jr) పైనే ఉన్నాయి. దాదాపు రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత నెయ్‌మార్ మళ్లీ వరల్డ్ కప్ జట్టులోకి వచ్చాడు. అయితే అతని ఫిట్‌నెస్ ఇష్యూస్ టీమ్‌కు కొంచెం టెన్షన్ పెడుతున్నాయి.
* కోచ్ నమ్మకం: మా టీమ్‌పై అనుమానాలు ఉండటం మంచిదే, గతంలో ఇలాంటి పరిస్థితుల్లోనే మేము చాలా సార్లు కప్పులు కొట్టామని గోల్‌కీపర్ అలిసన్ ధీమా వ్యక్తం చేశాడు.
బ్రెజిల్‌కు చుక్కలు చూపించనున్న మొరాకో:
* మొరాకో జట్టును తక్కువ అంచనా వేస్తే బ్రెజిల్‌కు ముప్పు తప్పదు. అష్రాఫ్ హకీమి, బ్రాహిమ్ డియాజ్ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్న మొరాకో టీమ్ ఏ జట్టునైనా ఓడించగలదు.
►ALSO READ | రేపే భారత్ vs పాక్ మధ్య బ్లాక్ బస్టర్ పోరు.. మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే!
* ట్విస్టులతో సన్నాహాలు: మొరాకో ఈ ఏడాది ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ టైటిల్ గెలిచినా.. వరల్డ్ కప్‌కు కేవలం మూడు నెలల ముందే వాళ్ల కోచ్ వాలిద్ రెగ్రాగుయ్ తప్పుకున్నాడు. ప్రస్తుతం బెల్జియంకు చెందిన మొహమ్మద్ ఓహాబి కొత్త కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.
గెలిచే ఛాన్స్ ఎవరికి ఉందంటే?:
ప్రముఖ స్టాట్స్ ప్రొవైడర్ ఆప్టా అనలిస్ట్ (Opta Analyst) అంచనా ప్రకారం ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల గెలుపు అవకాశాలు ఒక్కసారి పరిశీలిద్దాం..
* బ్రెజిల్ విజయావకాశాలు: 57.7%
* మొరాకో విజయావకాశాలు: 18.8%
* మ్యాచ్ డ్రా అయ్యే ఛాన్స్: 23.5%
* గ్రూప్–సీలో టాపర్‌గా నిలిచేందుకు బ్రెజిల్‌కు 65.85% ఛాన్స్ ఉండగా.. మొరాకోకు 23.14% అవకాశం ఉంది.
మ్యాచ్ టైమింగ్స్, లైవ్ ఎక్కడ చూడాలి?:
* మొరాకో కాలమానం ప్రకారం: రాత్రి 11:00 గంటలకు (beIN SPORTS Max 2 & 4 లో లైవ్)
* బ్రెజిల్ కాలమానం ప్రకారం: రాత్రి 7:00 గంటలకు (TV Globo, SBT, Globoplay లో లైవ్)
* యునైటెడ్ కింగ్‌డమ్ (UK) లో BBC One, iPlayer లో.. అమెరికా (US) లో FOX, పీకాక్ యాప్‌లలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.