
అంతర్జాతీయ సముద్ర జలాల్లో ముంచుకొచ్చిన ఒక మహా విపత్తును భారత నావికాదళం తన అసాధారణ చాకచక్యంతో తృటిలో తప్పించింది. చిన్న నిప్పురవ్వ వచ్చినా నడిసముద్రం అగ్నిగుండంగా మారే అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో.. నేవీ వీరులు ప్రాణాలకు తెగించి చేసిన సాహసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. యూఏఈలోని ఫుజైరా నుండి కొచ్చి వస్తున్న ‘ఎమ్‌టీ ఒలింపిక్ లైఫ్’ అనే ముడి చమురు ట్యాంకర్‌పై ఓమన్ తీరానికి సమీపంలో క్షిపణి దాడి జరిగింది. ఓడ ఇనుప రేకులను చీల్చుకుంటూ వెళ్లిన ఆ మిసైల్‌కు సంబంధించిన ‘లైవ్ వార్‌హెడ్’ పేలకుండా, నేరుగా లక్షలాది లీటర్ల ఆయిల్ ఉన్న స్టోరేజ్ ట్యాంక్ లోపలే చిక్కుకుపోయింది. అది ఏ క్షణంలోనైనా పేలిపోవడానికి సిద్ధంగా ఉన్న టైం బాంబులా మారింది. సమాచారం అందిన వెంటనే భారత నావికాదళానికి చెందిన ‘IFC-IOR’ అప్రమత్తమైంది. కొచ్చి సదరన్ నేవెల్ కమాండ్ నుంచి ప్రత్యేక ‘ఎక్స్‌ప్లోజివ్ ఆర్డ్‌నెన్స్ డిస్పోజల్’ బృందాన్ని హెలికాప్టర్ ద్వారా ఆ నౌకపైన దించింది. టైం బాంబులా మారిన ఆ నౌకపై నేవీ టీమ్ అత్యంత చాకచక్యంగా ఆపరేషన్ ప్రారంభించింది. మొదట గాల్వానిక్, థర్మల్ భద్రతా చర్యలు పూర్తి చేసి.. అత్యాధునిక పరికరాలతో ఆ మిసైల్ డెటోనేషన్ వైరింగ్ వ్యవస్థను విజయవంతంగా వేరు చేసింది. ఆ తర్వాత ఆ లైవ్ వార్‌హెడ్‌ను, దాని శిథిలాలను సురక్షితంగా బయటకు తీసి దర్యాప్తు కోసం తరలించారు. సముద్ర జలాల్లో అత్యవసర వేళల్లో భారత నావికాదళం ఎంత వేగంగా స్పందించగలదో, ప్రపంచ స్థాయి నైపుణ్యంతో ఎంతటి విపత్తునైనా ఎలా ఎదురించగలదో ఈ సాహసోపేత ఆపరేషన్ మరోసారి నిరూపించింది. భారత నేవీ వీరుల ధైర్యానికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. !
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ శుక్రవారం OTTల్లో సైన్మా జాతర.. ఒక్క రోజే 21 చిత్రాలు స్ట్రీమింగ్‌కు..
Vadde Naveen: బన్నీ ఎదుగుదల.. నన్ను ఆశ్చర్యపరిచింది
Raghava Lawrence: ‘రాజకీయాల్లోకి రావాలా వద్దా?’ ఫ్యాన్స్‌కి లారెన్స్ సూటి ప్రశ్న
Sing Geetham Review: మాటలు లేని పాటల ప్రయోగం హిట్టా..? ఫట్టా..?