Reading Time: < 1 minute
Vijay Sangeetha Reunion Buzz After Divorce Rumours Family Intervention Reports

CM Vijay – Sangeetha: తమిళ స్టార్ హీరో, ముఖ్యమంత్రి విజయ్.. ఆయన భార్య సంగీత స్వర్ణలింగం వైవాహిక బంధం గురించి గత కొంతకాలంగా నెట్టింట రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మనస్పర్థల కారణంగా విడిపోయిన ఈ జంట మళ్లీ ఒక్కటయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సంగీత ఫైల్ చేసిన విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తున్న తరుణంలోనే, వీరిద్దరూ తిరిగి కలవడం గమనార్హం. కుటుంబ సభ్యుల జోక్యంతోనే వీరి మధ్య ఉన్న వివాదాలు సర్దుమణిగాయని, ఇద్దరినీ మళ్లీ కలిపారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ అన్‌అఫీషియల్ న్యూస్ విన్న విజయ్ అభిమానులు ప్రస్తుతం పండగ చేసుకుంటున్నారు.

గత కొన్నేళ్లుగా విజయ్, సంగీత విడివిడిగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఓ నటితో విజయ్‌కు ఉన్న సంబంధం కారణంగానే తన 26 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్న సంగీత.. ఈ ఏడాది ఫిబ్రవరిలో చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. 2021 నుంచి విజయ్ తన సహనటితో రిలేషన్‌లో ఉన్నారని, ఆ బంధాన్ని తెంచుకుంటానని తనకు ప్రామిస్ చేసినా మాట నిలబెట్టుకోలేదని సంగీత తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ క్రమంలోనే విజయ్ స్టార్ హీరోయిన్ త్రిషతో ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గాసిప్స్ సైతం వచ్చాయి. పైగా ఇటీవల విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేడుకకు కానీ, అంతకుముందు జరిగిన ఎన్నికల ప్రచారంలో కానీ సంగీత, ఆమె పిల్లలు ఎక్కడా కనిపించకపోవడంతో వీరిద్దరూ విడిపోవడం ఖాయమనే ప్రచారం మరింత గట్టిపడింది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్‌తో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు చొరవ తీసుకుని ఇద్దరితోనూ మాట్లాడి సమస్యలను పరిష్కరించినట్లు తెలుస్తోంది. గతంలో విజయ్‌కు ఆయన తండ్రితో వచ్చిన విభేదాలను సైతం తల్లి శోభనే దగ్గరుండి సెటిల్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఆమె జోక్యంతోనే సంగీత లండన్ నుంచి నేరుగా చెన్నైకి చేరుకున్నారని, ప్రస్తుతం విజయ్-సంగీత ఇద్దరూ కలిసి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది.