Reading Time: < 1 minute

పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు ప్రతిష్టాత్మక అవార్డ్

Caption of Image.

హైదరాబాద్: పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. దేశంలోనే ఉత్తమ పోలీస్ ధృవీకరణ సేవలకు గానూ తెలంగాణ పోలీసులకు ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ లభించింది. 2025-26 పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో విశిష్ట సేవలకుగానూ కేంద్ర విదేశాంగ శాఖ ఈ పురస్కారం ప్రకటించింది. 

ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు తెలంగాణ పోలీసులను ఎంపిక చేసింది విదేశాంగ శాఖ. 2026, జూన్ 19న న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‎కు అధికారిక ఆహ్వానం అందింది. పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా డీజీపీ ఈ అవార్డు అందుకోనున్నారు. 

ALSO READ : జీడిమెట్లలో వీసాలు, పాస్‌పోర్టులు లేని ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్

వేగవంతమైన, పారదర్శక పోలీసు ధృవీకరణ సేవలకు గానూ తెలంగాణ పోలీసులకు ఈ గుర్తింపు దక్కింది. సాంకేతిక ఆధారిత వెరిఫికేషన్ విధానానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. తెలంగాణ పోలీసుల సేవా నిబద్ధతకు మరో నిదర్శనంగా ఈ అవార్డు నిలిచింది. దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్ఠ మరింత పెరిగింది. ప్రజా కేంద్రిత సేవలందింపుతో జాతీయ గుర్తింపు సాధించారు తెలంగాణ పోలీసులు. ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన తెలంగాణ పోలీస్ శాఖకు పలువురు ప్రశంసలు తెలుపుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.