Reading Time: 2 minutes
Tanikella Bharani : అతడు గొప్ప నటుడు.. నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు.. కారణం ఇదే.. తనికెళ్ల భరణి..

నటుడు తనికెళ్ళ భరణి ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నటుడు కోట శ్రీనివాసరావుతో తన వృత్తిపరమైన, వ్యక్తిగత సంబంధాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కోట శ్రీనివాసరావు తనకు ఎప్పుడూ పోటీ కాదని, తనకంటే గొప్ప నటుడని భరణి పేర్కొన్నారు. తాను కోట శ్రీనివాసరావు ఇంట్లో అతనితో నాటకాలు ఆడుతూ, అతని చేత అన్నం కల్పించుకుని తిన్నవాడిని అని తనికెళ్ళ భరణి గుర్తు చేసుకున్నారు. అతనితో ప్రయాణించిన వాడిగా, త్రికరణశుద్ధిగా చెప్పేది ఒక్కటేనని, కోట శ్రీనినివాసరావు తనకన్నా కాదు, చాలా మంది కన్నా గొప్ప నటుడని భరణి స్పష్టం చేశారు. అయితే, కొందరు చెస్ ప్లేయర్ లాగా తమ మధ్య పోటీని సృష్టించేందుకు ప్రయత్నం చేశారని, అది కోట శ్రీనివాసరావును బాధించిందని తెలిపారు. ఒకానొక సందర్భంలో కోట శ్రీనివాసరావు స్వయంగా భరణి ఇంటికి వచ్చి, తాను చేయాల్సిన ఒక వేషాన్ని (పాత్రను) వేయవద్దని అడిగారని భరణి వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

“ఏమయ్యా భరణి? ఆ వేషం నువ్వు వేస్తున్నావు అంట కదా? వెయ్యకు” అని కోట అడిగారని, దానికి తాను “ఎందుకు సార్? నన్ను తీసేసి మీకు ఇస్తున్నారా ఆ వేషం?” అని అడిగానని భరణి తెలిపారు. తాను వేయకపోతే పెద్దవాళ్లు సార్, మరి తనకు సర్వైవల్ ఉండదు కదా అని భరణి తన పరిస్థితిని వివరించారు. తాను నిజంగా గొప్పగా వేయలేదని, కోట శ్రీనివాసరావు వేసుంటేనే ఆ సినిమా బాగుండేదని భరణి అంగీకరించారు. రంగస్థలంపై తామిద్దరం అనేక నాటకాలను పంచుకున్నామని, అక్కడ తాము కోట శ్రీనివాసరావు కన్నా గొప్ప నటులం, పాపులర్ అని భరణి పేర్కొన్నారు. అయితే సినిమాల్లో మాత్రం కోట శ్రీనివాసరావు చాలా గొప్ప నటుడని భరణి తేడాను వివరించారు. సినిమాల్లో అతనికి మంచి పాత్రలు దొరకడం వల్లే ఎలివేట్ అయ్యారని, ప్రకాష్ రాజ్ లాగా మంచి పాత్రల వల్లనే నటులు వెలుగులోకి వస్తారని భరణి అన్నారు.

కోట శ్రీనివాసరావు కొన్ని పట్టులు, గాంభీర్యం ఉన్న పాత్రలను అద్భుతంగా చేస్తారని, యములీల వంటి చిత్రాల్లో తాను చేసిన పాత్రలు ఆయన చేయలేకపోవచ్చని, అలాగే కొన్ని సెంటిమెంట్ పాత్రలు తాను బాగా చేయగలనని భరణి తెలిపారు. తాను సినిమాల్లోకి రావడానికి పెద్దగా కష్టపడలేదని, నాటకాల్లో పడాల్సిన కష్టాలు ముందే పడిపోయి, రాజభోగంగా వచ్చేశానని తెలిపారు. రాళ్ళపల్లి వంటి గురువులు తనను చూసుకున్నట్లే, తాను కూడా తన శిష్యులను, అసిస్టెంట్లను చూసుకోవడం ప్రారంభించానని భరణి పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు

తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు ఫోటో..

Tanikella Bharani, Kota Sri

Tanikella Bharani, Kota Srinivasarao

ఎక్కువమంది చదివినవి : Jai Chiranjeeva: చిరంజీవి మేనకోడలు ఇంత మారిపోయింది మావా.. ? గ్లామరస్ లుక్కులో అదిరిపోయిన జై చిరంజీవి చైల్డ్ ఆర్టిస్ట్..