చాలా మంది ఇంటిలో కుక్క, పిల్లిని పెంచుకోవడం చేస్తుంటారు. అంతే కాకుండా చాలా మంది కొన్ని రకాల పక్షులను కూడా పెంచుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో కొన్ని రకాల పక్షులు సానుకూలతను పెంచితే, మరికొన్ని పక్షులు ప్రతికూలతలను పెంచుతుంది. మరి అసలు వాస్తు ప్రకారం ఇంటిలో చిలుకను పెంచుకోవడం మంచిదేనా? అంటే?
వాస్తు శాస్త్రం బట్టి చూస్తే ఇంటిలో చిలకను పెంచుకోవడం చాలా మంచిది అని చెబుతున్నారు నిపుణులు. దీనిని ఇంట్లో పెంచుకోవడం వలన ఇది సానుకూల శక్తిని పెంపొందించడమే కాకుండా, అన్నివిధాలుగా కలిసి వస్తుందట. ప్రతి కూల శక్తిని తొలిగించి, ఇంటిలో ఆనందం, శ్రేయస్సును నింపుతుందంట. అందుకే ఇంటిలో చిలుకను పెంచుకోవడం చాలా మంచిది అంటున్నారు వాస్తు పండితులు.
చిలుకను పెంచుకోవడం మంచిదే అయినప్పటికీ తప్పకుండా కొన్ని వాస్తు నియమాలు పాటించాలంట. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా చిలుకను ఉత్తరం లేదా తూర్పు దిశలో పెంచుకోవడం వలన కలిసి వస్తుంది. ఒక వేళ మీరు గనుక చిలుకను పడమర లేదా దక్షిణ దిశలో పెంచుతున్నట్లు అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట.
అలాగే చాలా మంది చిలుకను పంజరంలో బంధించి పెంచుకుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట. ఒక వేళ పంజరంలో ఉన్నా, చిలుక ఆనందంగా ఉంటే, ఎలాంటి సమస్యలు ఉండవు కానీ, సంతోషంగా లేకపోతే, అది మీ జీవితంలో చిక్కులకు, సమస్యలకు కారణం అవుతుందంట. ఇంటిలో ప్రతికూలతలను పెంచుతుందంట.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




