ఎక్కవ దూరాన్ని తక్కువ ఖర్చుతో చేరుకోవడానికి సులభమైన మార్గం ఏదైనా ఉందంటే.. అది ట్రైన్ జర్నీ మాత్రమే.. అందుకే చాలా మంది ట్రైన్లో ప్రయాణించేందుకు ఇష్టపడుతారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటైన భారతీయ రైల్వే, ప్రతిరోజూ దాదాపు 13,000 ప్యాసింజర్ రైళ్లను నడుపుతోంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ప్రతిరోజూ మిలియన్ల మంది ప్రజలు ప్రయాణిస్తున్నారు.
అయితే ప్రయాణికుల సౌకర్యార్థం చాలా ట్రైన్స్ భోజనాలకు కూడా అందుబాటులో ఉంచుతాయి. ప్రయాణికులు డబ్బు చెల్లించి భోజనం కొనుగోలు చేయవచ్చు. కానీ మన దేశంలో మూడు పూటలా ఉచితంగా భోజనం పెట్టే ఒక ట్రైన్ ఉందని విషయం మీకు తెలుసా? అవును వీనేది నిజమే భారత రైల్వేలకు చెందిన ఒక ట్రైన్ ప్రయాణికులు పూర్తిగా మూడు పూటల ఉచిత భోజనాన్ని అందిస్తుందట.
అదే సచ్ఖండ్ ఎక్స్ప్రెస్.. సాధారణంగా భారతీయ రైల్వే నడిపే మెజారిటీ రైళ్లలో మనం డబ్బులు పెట్టి ఆహారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సఖ్ఖండ్ రైలులో మాత్రం ప్రయాణికులకు ఉచితంగా ఆహారం లభిస్తుంది. ఈ రైలు పంజాబ్లోని అమృత్సర్ నుండి మహారాష్ట్రలోని నాందేడ్ మధ్య రాకపోకలు సాగిస్తోంది.
అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.. ఈ ట్రైన్లో అందించే ఉచిత భోజనాన్ని భారతీయ రైల్వే శాఖ అందించడం లేదు.సిక్కు మతస్థుల పవిత్ర గురుద్వారాల నిర్వాహకులు, స్వచ్ఛంద సేవకులు దీనిని నిర్వహిస్తున్నారు. ఈ రైలు వెళ్లే మార్గంలో ఉన్న కొన్ని ప్రధాన స్టేషన్లలో గురుద్వారా కమిటీలు ప్రయాణికుల ఈ ఉచిత భోజనాన్ని అందిస్తాయి.
అమృత్ సర్ నుంచి నాందేడ్ వెళ్లే మార్గంలో మొత్తం ఆరు స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది. ఈ స్టేషన్లలో గురుద్వారా కమిటీలు ప్రయాణికులు మూడు పూటల భోజనాన్ని అందజేస్తాయి. వీరు పెట్టే మోనూ పూర్తి శాఖాహారం. ఈ మెనూలో పప్పు , రోటీ, కూర వంటివి వడ్డిస్తారు. రోజువారీ మెనూలో మార్పులు ఉంటాయి. భారతీయ రైల్వే చరిత్రలో భక్తి, సేవ కలగలిసిన ఒక అద్భుతమైన ప్రయాణ అనుభవానికి ఈ సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తోంది.




