
Kanchana 4: కాంచన సినిమాలకు భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రాఘవ లారెన్స్ డైరెక్షన్ – లీడ్ రోల్‌లో తెరకెక్కే ఈ హారర్ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే కాంచన సిరీస్2లో వచ్చిన మూడు భాగాలు కాసుల వర్షం కురిపించగా.. ఇప్పుడు అంతకుమించిన భారీ తారాగణంతో ‘కాంచన 4’ ను పట్టాలెక్కించేందుకు లారెన్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది.
ఈ ప్రాజెక్ట్‌లోని అత్యంత పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే.. లేడీ సూపర్‌స్టార్ నయనతార ఒక పవర్‌ఫుల్ కీ రోల్‌ను పోషించబోతున్నారట. ఈ సినిమా కథను మలుపు తిప్పే ఒక బలమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో నయనతార పాత్ర ఉండబోతోందని సమాచారం. ఈ హారర్ ఫ్రాంచైజీలోకి నయన్ ఎంట్రీ ఇస్తుండటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా స్కై హైకి చేరాయి. ఈ సినిమాలో కేవలం నయనతార మాత్రమే కాకుండా, మెయిన్ ఫీమేల్ లీడ్స్‌గా ఇద్దరు గ్లామరస్ బ్యూటీలు సందడి చేయనున్నారట. ఈ హారర్ యూనివర్స్‌లో మెయిన్ హీరోయిన్‌గా బుట్టబొమ్మ పూజా హెగ్డే కనిపించబోతోందని సమాచారం. గ్లామర్‌తో పాటు కథలో ప్రాధాన్యత ఉన్న రోల్‌ను పూజా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ నర్గిస్ ఫక్రీ సైతం ఈ సినిమాలో మరో కీలకమైన కథానాయిక పాత్రలో నటించబోతోందనే టాక్ నడుస్తోంది. ఈ ముగ్గురు భామల ఎంట్రీతో ‘కాంచన 4’ గ్లోబల్ వైడ్‌గా భారీ మార్కెట్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సాధారణంగానే లారెన్స్ కాంచన సిరీస్ సినిమాల్లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లు అత్యంత ఎమోషనల్‌గా, భయంకరంగా సాగుతుంటాయి. ఈసారి ఆ ఎపిసోడ్‌ను నయనతార లాంటి సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్‌తో ప్లాన్ చేయడం సినిమాకు అతిపెద్ద అస్సెట్ కానుందని చెబుతున్నారు. దానికి తోడు పూజా హెగ్డే, నర్గిస్ ఫక్రీల గ్లామర్ హంగులు తోడవ్వడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మునుపటి రికార్డులను తిరగరాయడం ఖాయమని కాంచన ఫ్యాన్స్ నమ్ముతున్నారు. త్వరలోనే ఈ క్రేజీ కాస్టింగ్, షూటింగ్ షెడ్యూల్‌పై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది.