
India vs Pakistan Rivalry: భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే గ్రౌండ్‌లోనూ, బయటా ఉండే హైప్ వేరే లెవెల్.. రేపు (జూన్ 14, ఆదివారం ) బర్మింగ్‌హామ్ వేదికగా ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2026లో ఈ ఇరు జట్లు తమ ఫస్ట్ మ్యాచ్‌లోనే ముఖాముఖి తలపడబోతున్నాయి. ఈ క్రేజీ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) ఇండో-పాక్ మ్యాచ్ ప్రెజర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని షేర్ చేసుకుంది. జెమీమా మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ గెలవడం ఎంత ముఖ్యమో తన బిల్డింగ్ వాచ్‌మెన్ కూడా గుర్తు చేస్తుంటాడని నవ్వుతూ చెప్పుకొచ్చింది.
ఎవరితో ఓడినా పర్లేదు.. పాకిస్తాన్‌పై మాత్రం కాదు:
తన ఫస్ట్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జ్ఞాపకాలను జెమీమా రోడ్రిగ్స్ గుర్తు చేసుకుంది. నేను నా ఫస్ట్ ఇండో-పాక్ మ్యాచ్ ఆడేటప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో హర్మన్‌ప్రీత్ దీదీ మాతో ఒక విషయం చెప్పింది.. ‘బయట నుంచి మస్తు ప్రెజర్ ఉంటుంది, ఫ్యాన్స్ మన నుంచి ఏం ఆశిస్తున్నారో మనకు తెలుసు, ఆ హిస్టరీని మనం కాదనలేమని ధైర్యం చెప్పింది. మా బిల్డింగ్ వాచ్‌మెన్ కూడా నన్ను చూసినప్పుడు.. ‘అమ్మా! ఎవరి చేతిలోనైనా ఓడిపోండి కానీ పాకిస్తాన్ చేతిలో మాత్రం ఓడిపోవద్దని చెప్తాడు. ప్రజలు క్రికెట్‌ను, ఈ రైవల్రీని అంతలా ప్రేమిస్తారు అని జెమీమా వెల్లడించింది.
కప్పు కొట్టడమే టార్గెట్:
పాకిస్తాన్‌తో మ్యాచ్ ఇంపార్టెంటే అయినా.. తమ అల్టిమేట్ గోల్ మాత్రం వన్ అండ్ ఓన్లీ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడటమే అని జెమీమా రోడ్రిగ్స్ స్పష్టం చేసింది. ట్రోఫీని ఎత్తడాన్ని మేము ప్రతిరోజూ ఉదయం ఊహించుకుంటాం (Visualise చేస్తాం).. ఒక విషయాన్ని మనం బలంగా నమ్మి, ఊహిస్తే.. మన అడుగులు ఆ దిశగానే పడతాయని మా టీమ్ నమ్ముతుంది.. 2025 వరల్డ్ కప్‌లోనూ ఇదే చేశాం.. ఇప్పుడు కోచ్ అమోల్ ముజుందార్ సర్ కూడా దీనిని కంటిన్యూ చేయిస్తున్నారని పేర్కొనింది.
ప్రెజర్‌ను తట్టుకునేలా ప్రాక్టీస్:
మ్యాచ్‌లో ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో నెట్స్‌లోనే ప్రాక్టీస్ చేస్తున్నట్లు జెమీమా వివరించింది. మేము ప్రాక్టీస్‌లోనే మమ్మల్ని కష్టమైన పరిస్థితుల్లో పడేసుకుని రకరకాల సినారియోస్ ఆడుతాం.. ప్రాక్టీస్ ఎంత కఠినంగా ఉంటే.. మ్యాచ్ అంత ఈజీ అవుతుంది.. రీసెంట్‌గా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో మేము అనుకున్నంత బాగా ఆడలేదు.. కానీ, కొన్నిసార్లు గెలుపు కంటే ఓటమే ఎక్కువ నేర్పిస్తుంది.. ఆ తప్పుల నుంచి నేర్చుకుని ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నామని జెమీమా రోడ్రిగ్స్ ధీమా వ్యక్తం చేసింది.
కూల్‌గా ఉండడమే ముఖ్యం: హెడ్ కోచ్
మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాతో పాటు ఏ ఒక్క ప్లేయర్ పైనో ఎక్కువ ఫోకస్ పెట్టడం కరెక్ట్ కాదన్నాడు. ఇది టీ20 క్రికెట్.. ఇక్కడ ఏ బౌలర్ అయినా ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను తిప్పేయగలడు.. మనం చేయాల్సిందల్లా గ్రౌండ్‌లోకి వెళ్లాక కూల్‌గా ఉంటూ మన ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయడమేనని ప్లేయర్లకు సూచించాడు.
Few contests in cricket compare to India vs Pakistan. ⚡#JemimahRodrigues shares what it means to be part of one of the sport’s biggest rivalries and the excitement that comes with it. 🇮🇳🔥
ICC Women’s #T20WorldCup 2026 👉 #INDvPAK | SUN, 14th June, 6 PM! pic.twitter.com/b3SJg8Z4QR
— Star Sports (@StarSportsIndia) June 11, 2026
“They love this rivalry!” 🇮🇳#HarmanpreetKaur, #JemimahRodrigues & #DeeptiSharma speak on what makes the India-Pakistan rivalry so fierce. 🔥
ICC Women’s #T20WorldCup 2026 | Starts 12th June #INDvPAK | SUN, 14th June 🔥🤩 pic.twitter.com/NNkMUeMDxb
— Star Sports (@StarSportsIndia) June 12, 2026