Reading Time: 2 minutes
Cinema : ఒక్కో సీన్ అరాచకం మావ.. 15 ఏళ్లుగా ట్రెండిం‏గ్‏లో ఉన్న సిరీస్.. జనాలు పదే పదే చూస్తున్నారు..

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల విస్తృతి పెరిగిన తర్వాత వెబ్ సిరీస్‌ల హవా ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. అయితే, ఎన్ని కొత్త సిరీస్‌లు వచ్చినా, దాదాపు 15 సంవత్సరాలుగా డిజిటల్ దునియాను ఏలుతూ, ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్న ఒకే ఒక్క మైండ్-బ్లోయింగ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (Game of Thrones). ఈ హాలీవుడ్ ఎపిక్ ఫాంటసీ డ్రామా ఇప్పటికీ జియోహాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మోస్ట్ వాచ్డ్ సిరీస్‌గా టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. డేవిడ్ బెనియాఫ్, డి. బి. వైస్ సృష్టించిన ఈ సిరీస్ మొదటిసారిగా 2011 ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొత్తం 8 సీజన్లు, 74 ఎపిసోడ్‌లుగా రూపొందిన ఈ సిరీస్‌లోని ప్రతి ఎపిసోడ్ దాదాపు 50 నుండి 82 నిమిషాల నిడివితో ఒక లార్జర్-ద్యాన్-లైఫ్ సినిమా చూసిన అనుభూతిని ఇస్తుంది. ఐఎండిబి (IMDb)లో ఈ సిరీస్ 10కి గానూ 9.2 అత్యుత్తమ రేటింగ్‌ను కలిగి ఉండి, ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన సిరీస్‌గా రికార్డు సృష్టించింది.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు

కథ విషయానికి వస్తే..

వివిధ రాజవంశాల మధ్య సాగే లీనమయ్యే రాజకీయాలు, సింహాసనం కోసం జరిగే కుట్రలు, ఊహించని నమ్మకద్రోహాలు, డ్రాగన్స్ వంటి అద్భుతమైన మాయా శక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అత్యంత భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్, నటీనటుల అద్భుతమైన ప్రదర్శన ఈ సిరీస్‌ను ఒక విజువల్ వండర్‌గా మార్చాయి. భారతదేశంలో కూడా ఈ సిరీస్‌కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ హిందీతో పాటు పలు భారతీయ భాషల ఆడియో వెర్షన్లలో అందుబాటులో ఉంది.

ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

థ్రిల్, సస్పెన్స్, యాక్షన్‌ను ఇష్టపడే ప్రేక్షకులు ఇప్పటికీ ఈ 74 ఎపిసోడ్‌ల సిరీస్‌ను ‘బింజ్ వాచ్’ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం వెస్ట్రన్ కంటెంట్‌గానే కాకుండా, గ్లోబల్ పాప్ కల్చర్‌లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ క్రేజ్ రాబోయే రోజుల్లోనూ తగ్గేలా కనిపించడం లేదు.

ఎక్కువమంది చదివినవి : Jai Chiranjeeva: చిరంజీవి మేనకోడలు ఇంత మారిపోయింది మావా.. ? గ్లామరస్ లుక్కులో అదిరిపోయిన జై చిరంజీవి చైల్డ్ ఆర్టిస్ట్..