వైద్య చరిత్రలో సాంకేతికత (Technology) రోజురోజుకూ ఊహించని రేంజ్‌లో దూసుకుపోతోంది. ఒకప్పుడు ఏదైనా పెద్ద జబ్బు వస్తే, దాన్ని కనిపెట్టడానికి రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఎన్నో రకాల టెస్టులు, స్కాన్లు చేయించుకోవాల్సి వచ్చేది. దీనివల్ల డబ్బుతో పాటు ఎంతో విలువైన సమయం కూడా వృథా అయ్యేది. కానీ, ఇప్పుడు ఒకే ఒక్క మెషీన్‌తో ప్రమాదకరమైన వ్యాధులను ముందే కనిపెట్టే సరికొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. వైద్య చరిత్రలోనే అద్భుతంగా నిలిచిన ఆ కొత్త స్కానర్ ముచ్చట్లు ఇప్పుడు చూద్దాం.
వైద్య రంగంలో ‘బయోగ్రాఫ్ వన్’ సంచలనం: కెనడాకు చెందిన ప్రముఖ మెడికల్ టెక్నాలజీ సంస్థ ‘సీమెన్స్ హెల్త్ నీర్స్’ ఒక సరికొత్త రికార్డు సృష్టించింది. వైద్యుల పనిని సులువు చేస్తూ, రోగుల ప్రాణాలను కాపాడేందుకు ‘బయోగ్రాఫ్ వన్’ అనే ఒక అత్యంత అధునాతన హైబ్రిడ్ మెడికల్ ఇమేజింగ్ స్కానర్‌ను శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇక ఈ స్కానర్ రాకతో వైద్య రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైందని నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒకేసారి PET మరియు MRI స్కాన్లు: ఈ యంత్రం యొక్క అతిపెద్ద స్పెషాలిటీ ఏంటంటే.. సాధారణంగా వేర్వేరుగా చేసే ‘పోసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ’ అలాగే ‘మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్’ స్కాన్లను ఇది ఒకే ఒక్కసారిగా, ఒకే మెషీన్‌లో పూర్తి చేస్తుంది. ఇక దీనివల్ల పేషెంట్లను ఒక స్కాన్ రూమ్ నుండి మరో స్కాన్ రూమ్‌కు మార్చే అవసరం ఉండదు. అతి తక్కువ సమయంలోనే శరీర అంతర్భాగంలో ఉన్న సమస్యలకు సంబంధించిన అత్యంత స్పష్టమైన చిత్రాలు డాక్టర్లకు అందుతాయి.

ఖతర్నాక్ జబ్బుల ముందస్తు నిర్ధారణ: ఈ ‘బయోగ్రాఫ్ వన్’ స్కానర్ ద్వారా ప్రాణాంతక క్యాన్సర్ కణాల దగ్గర నుండి హఠాత్తుగా వచ్చే స్ట్రోక్ (పక్షవాతం), మనుషులను పీడించే దీర్ఘకాలిక నొప్పులు, మరియు బ్రెయిన్‌కు సంబంధించిన నాడీ రుగ్మతలను చాలా ముందుగానే గుర్తించవచ్చు. ఇక ఏదైనా వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పుడే దీని ద్వారా తెలుసుకోవడం వల్ల, రోగికి సరైన సమయంలో ట్రీట్‌మెంట్ అందించి ప్రాణాలను కాపాడటం చాలా సులభం అవుతుంది.
ఇక క్యాన్సర్, స్ట్రోక్ లాంటి భయంకరమైన రోగాలను ఎదుర్కోవడానికి ‘బయోగ్రాఫ్ వన్’ స్కానర్ ఒక బ్రహ్మాస్త్రం లాంటిదని చెప్పొచ్చు. టెక్నాలజీని ఉపయోగించి ఒకే యంత్రంతో ఇన్ని రకాల జబ్బులను ముందే గుర్తించేలా చేయడం నిజంగా వైద్య చరిత్రలోనే ఒక మైలురాయి. భవిష్యత్తులో ఈ స్కానర్ అన్ని హాస్పిటల్స్‌కు అందుబాటులోకి వస్తే లక్షలాది మంది ప్రాణాలను సకాలంలో కాపాడే అవకాశం లభిస్తుంది.
గమనిక: ఈ సమాచారం కెనడాకు చెందిన సీమెన్స్ హెల్త్ నీర్స్ సంస్థ అధికారికంగా విడుదల చేసిన నివేదికల ఆధారంగా సాధారణ అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది.
The post స్ట్రోక్ నుంచి నాడీ రుగ్మతల వరకు… ఒకే యంత్రంతో ముందస్తు నిర్ధారణ! appeared first on Manalokam – Latest Telugu News & Updates.