
ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. అంతేకాదు ఇంటి సంపు నిర్మాణం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇంటికి ప్రహరీగోడ నిర్మించుకొనే విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి..మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు ఏమంటున్నారో చూద్దాం…
ప్రశ్న: కొత్తగా కట్టుకున్న ఇంటికి సంపు నిర్మించుకోవాలనుకుంటున్నాం. దీనికి కూడా వాస్తు పాటించాలా? ఒకవేళ సంపు కట్టుకుంటే ఏవైపు ఉంటే మంచిది?
జవాబు: సంపు నిర్మాణానికి కూడా వాస్తు పాటించాల్సిందే. ఇంటికి తూర్పు ఈశాన్యంలో సంపు కట్టుకుంటే మంచిది.
ప్రశ్న: మా ఇంటికి తూర్పు, ఉత్తరం వైపు రోడ్స్ ఉన్నాయి. మిగతా రెండువైపులా కాంపౌండ్ వాల్. కట్టుకోవాలనుకుంటున్నాం. రెండువైపులా వదిలేసి, మిగతా రెండువైపుల మాత్రమే కాంపౌండ్ వాల్ కట్టుకోవచ్చా?
జవాబు: కుదిరితే నాలుగు వైపులా ప్రహరీ కట్టుకోవాలి. అదే మంచిది. ఒకవేళ వీలు కాకుంటే దక్షిణ, పడమర వైపులా ప్రహరీ కట్టుకోవచ్చు.