
జగిత్యాలలో ఇందిరమ్మ చీరల పంపిణీపై కొత్త వివాదం చెలరేగింది.పేద మహిళలకు ఎంతో గౌరవంగా పంపిణీ చేయాల్సిన చీరలను… మున్సిపల్ చెత్త సేకరించే ఆటోల్లో తరలించడం తీవ్ర దుమారం రేపుతోంది.
జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని మెప్మా కార్యాలయం నుంచి… వివిధ వార్డులకు ఈ ఇందిరమ్మ చీరలను రవాణా చేస్తున్నారు. అయితే, బట్టలు తీసుకెళ్లే వాహనాల్లో కాకుండా… ప్రతిరోజూ వీధుల్లో చెత్త సేకరించే మున్సిపల్ ఆటోలలో ఈ చీరల కట్టలను కుక్కారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన చీరలను… ఇలా అగౌరవంగా, కనీస బాధ్యత లేకుండా చెత్త వాహనాల్లో తరలించడంపై స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
►ALSO READ | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల స్టేట్‌మెంట్ రికార్డ్ సిట్
దీనికి సంబంధించిన విజువల్స్, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పేదలకు ఇచ్చే కానుకలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రభుత్వాన్ని, మున్సిపల్ అధికారులను నిలదీస్తున్నారు.