
సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ (Jailer 2). బాక్సాఫీస్ వద్ద మరోసారి రికార్డులు సృష్టించడానికి ఈ కాంబో రెడీ అవుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఒక పవర్‌ఫుల్ అతిథి పాత్ర లో మెరవబోతున్నారని టాక్ వినిపిస్తోంది..
షారూఖ్ ప్లేస్‌లోకి హృతిక్
నిజానికి, ఈ పాత్రను ముందుగా బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ చేయాల్సింది. కానీ, ఆయన తన కూతురు సుహానా ఖాన్ తో కలిసి చేస్తున్న ‘కింగ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ చిత్రంలోని ప్రత్యేకమైన లుక్‌ను రివీల్ చేయకూడదనే కారణంతో రెస్పెక్ట్‌ఫుల్‌గా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. దీంతో ఈ క్రేజీ రోల్ హృతిక్ రోషన్ వద్దకు వెళ్ళింది. దీనికి ఓకే చెప్పినట్లు సమాచారం.
40 ఏళ్ల తర్వాత రజనీ-హృతిక్ కాంబో..
ఈ క్యామియో ద్వారా రజనీకాంత్, హృతిక్ రోషన్ దాదాపు 40 సంవత్సరాల తర్వాత మళ్లీ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. 1986లో వచ్చిన ‘భగవాన్ దాదా’ చిత్రంలో రజనీకాంత్‌కు పెంపుడు కొడుకుగా హృతిక్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. మళ్లీ ఇన్నాళ్లకి ఈ ఇద్దరు స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం సినీ ఇండస్ట్రీలో ఒక రేర్ , క్రేజీ మూమెంట్ ను క్రియేట్ చేస్తుంది..
►ALSO READ | Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 30కి పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఏది ఎక్కడ చూడాలంటే?
ఈ మూవీలో రజనీకాంత్ (ముత్తువేల్ పాండియన్) తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పుడు, అతనికి సహాయం చేయడానికి వచ్చే ఒక పవర్‌ఫుల్ స్నేహితుడి పాత్రలో హృతిక్ కనిపిస్తాడట. చెన్నైలో జూన్ 22, 23 తేదీల్లో హృతిక్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ పాత్ర కోసం హృతిక్‌కు సరికొత్త లుక్ టెస్ట్ కూడా చేయబోతున్నారని సమాచారం..
రీషూట్స్
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు మేకర్స్ కేక్ కటింగ్ వీడియోలతో ప్రకటించారు. అయితే, అవుట్‌పుట్ చూశాక కొన్ని సీన్స్ అంతగా నచ్చకపోవడంతో, దర్శకుడు నెల్సన్ ప్రస్తుతం కొన్ని కీలక భాగాలను రీషూట్ చేస్తున్నట్లు టాక్. హృతిక్ రోషన్‌తో పాటు మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి లాంటి హేమాహేమీలు ఈ సినిమాలో అలరించనున్నారు. ఈ చిత్రంతోనే విద్యాబాలన్ తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుండగా ఎస్‌జే సూర్య, రమ్యకృష్ణ, యోగిబాబు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే, సెప్టెంబర్ 2026 లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రానుంది.